Share News

పీలేరు సంతలో నాటుకోళ్ల సందడి!

ABN , Publish Date - Dec 15 , 2024 | 11:49 PM

పీలేరు వారపు సంతలో ఆదివారం నాటు కోళ్లు, కాసులు కురిపించే పందెం పుంజులు సందడి చేశాయి.

పీలేరు సంతలో నాటుకోళ్ల సందడి!
పీలేరు సంతకు వచ్చిన నాటుకోళ్లు

సంక్రాంతి నేపథ్యంలో పెరిగిన కొనుగోళ్లు

పీలేరు, డిసెంబరు 15: పీలేరు వారపు సంతలో ఆదివారం నాటు కోళ్లు, కాసులు కురిపించే పందెం పుంజులు సందడి చేశాయి. అటు రైతులు, ఇటు వ్యాపారులు పెద్దఎ త్తున రావడంతో సంత ప్రాంగణం లో కోలాహలం నెలకొంది. సంక్రాం తి పండుగ వస్తున్న నేపథ్యంలో ఆదివారం జరిగిన సంతకు వ్యాపారు లు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పీలేరుతోపాటు సదుం, కలికిరి, పులిచెర్ల, పుంగనూరు, రాయచోటి ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు తమ కోళ్లు, పుంజులను సంతకు తెచ్చారు. ఒక్కో నాటు కోడి రూ.600 నుంచి రూ.1200ల దాకా పలుకగా పందెం పుంజులు మాత్రం వాటి రకాన్ని బట్టి ఒక్కొక్కటి రూ.వేయి నుంచి రూ.7 వేల దాకా ధర పలికాయి. పీలేరు సంతలో కొనుగోలు చేసిన పుంజులను కొంత కాలం బాగా మేపి ఉభయ గోదావరి జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగే సంక్రాంతి కోడిపందేలలో స్వంతంగా పోటీకి దింపడమో లేక పందెంరాయుళ్లకు అమ్మడమో చేస్తారని స్థానిక వ్యాపారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమీపించే కొద్దీ పీలేరు సంతలో పుంజుల విక్రయం జోరందుకుంటుందని స్థానిక పెంపకందారులు తెలిపారు.

Updated Date - Dec 15 , 2024 | 11:49 PM