Share News

స్థలాన్ని షాహీ జామియా మసీదు కమిటీకి స్వాధీనం చేయాలి

ABN , Publish Date - Feb 23 , 2024 | 10:46 PM

మసీదు స్థలాన్ని పూర్తిగా షాహీ జామియా మసీదు కమిటీకే స్వాఽ దీనం చేయాలని ఆ మసీదు కమిటీ మాజీ అధ్య క్షుడు, సివిల్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌ డాక్టర్‌ హుస్సేని అన్నారు.

స్థలాన్ని షాహీ జామియా మసీదు కమిటీకి స్వాధీనం చేయాలి
నిరాహార దీక్ష చేస్తున్న ముస్లింలు

రాయచోటిటౌన్‌, ఫిబ్రవరి23: మసీదు స్థలాన్ని పూర్తిగా షాహీ జామియా మసీదు కమిటీకే స్వాఽ దీనం చేయాలని ఆ మసీదు కమిటీ మాజీ అధ్య క్షుడు, సివిల్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌ డాక్టర్‌ హుస్సేని అన్నారు. శుక్రవారం స్థానిక జామియా మసీదు కు ఎదురుగా ముస్లింలతో కలిసి ఆయన నిరా హార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 12.5 ఎకరాల జామియా మసీదు స్థలంలో 4 ఎకరాల స్థలాన్ని కమిటీకి కేటాయిస్తామని హామీ ఇచ్చిన ఒక ముఖ్య మంత్రి మాట ఇచ్చి మడమ తిప్పారని, మరో ముఖ్యమంత్రి మాటిచ్చి మరిచారని, మరో ముఖ్యమంత్రి కనుమరుగయ్యారన్నారు. ఎన్నికల సమయంలో మైనార్టీల ఓట్లతో అందలమెక్కిన నాయకులు ఆ తర్వాత హామీలను మర్చిపోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదు స్థలం తమకు అప్పగించేంతవరకు నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువు సర్కాజీ షర్ఫుద్దీన్‌, అజీజుర్‌ రెహ్మాన్‌, ఖదీర్‌, సలీం, తాలిబ్‌ అలీఖాన్‌, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2024 | 10:46 PM