Share News

సుగవాసితో ఆకేపాటి సోదరుల భేటీ!

ABN , Publish Date - Nov 10 , 2024 | 11:21 PM

రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యంతో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాఽథ్‌రెడ్డి చిన్నాన్న గోపాల్‌రెడ్డి కుమారులు, వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి అలియాస్‌ మురళీరెడి,్డ ఆయన సోదరుడు మండల పరిషత ఉపా ధ్యక్షుడు ఆకేపాటి రంగారెడ్డి, మండలాధ్యక్షుడు వెంకట నారాయణ ఆదివారం భేటీ అయ్యారు.

సుగవాసితో  ఆకేపాటి సోదరుల భేటీ!
సుగవాసి బాలసుబ్రమణ్యంకు స్వాగతం పలుకుతున్న ఆకేపాటి సోదరులు శ్రీనివాసులరెడ్డి, రంగారెడ్డి

రాజంపేట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యంతో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాఽథ్‌రెడ్డి చిన్నాన్న గోపాల్‌రెడ్డి కుమారులు, వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి అలియాస్‌ మురళీరెడి,్డ ఆయన సోదరుడు మండల పరిషత ఉపా ధ్యక్షుడు ఆకేపాటి రంగారెడ్డి, మండలాధ్యక్షుడు వెంకట నారాయణ ఆదివారం భేటీ అయ్యారు. రాజంపేట మండల పరిషత సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచలు, వారి వర్గీయులు సుగవాసిని ఘనంగా సత్కరించారు. దీంతో ఈ విషయం రాజంపేట నియోజక వర్గంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆకేపాటి సోదరులు త్వరలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. వీరితోపాటు పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి

రాజంపేట మండల సర్వతోముఖాభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని టీడీపీ ఇన చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం తెలిపారు. రాజంపేట మండల సర్వసభ్య సమా వేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దివంగత నాయకుడు ఆకేపాటి గోపాల్‌రెడ్డి, తమ తండ్రి పాలకొండ్రాయుడు ప్రాణ స్నేహితులని, ఆయన కుమారుల ఆహ్వానం మేరకు రాజంపేట మండల సమావేశానికి హాజరయ్యా నన్నారు. ఇక్కడి సమస్యలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్య మంత్రి పవనకళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వరప్రసాద్‌, సూపరింటెంటెంట్‌ బాల మునుస్వామితో పాటు మండల అఽఽఽధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజంపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద 50 మంది పోలీసులతో భారీ బందోబస్లు ఏర్పాటు చేశారు.

సుగవాసికి ఘన సత్కారం

మండల సమావేశానికి సుగవాసి బాలసుబ్రమణ్యంను ఘనంగా స్వాగతించారు. మండల మాజీ ఉపాధ్యక్షుడు నాగా సుధాకర్‌రెడ్డి, మైనార్టీ కోఆప్షన సభ్యుడు గౌస్‌, మండల టీడీపీ అధ్యక్షుడు శివనారాయణ తదితరులు గజమాలలు వేసి శాలువా లతో సత్కరించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ చెన్నూరు సుధా కర్‌, మాజీ ఎంపీపీ గుడారు సుబ్రమణ్యంనాయుడు, మండల మాజీ ఉపాధ్యక్షుడు రామనరసింహులు, సీనియర్‌ టీడీపీ నేతలు బీఎల్‌ ప్రసాద్‌, తెలుగుయువత నాయకులు దగ్గుపాటి రవికుమార్‌, మండల టీడీపీ నాయకుడు మేకా నరసిం హులు, గీతాంజలి విద్యా సంస్థల అధినేత ఎస్వీ రమణ, పలువురు సర్పంచలు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

లక్ష సభ్యత్వాలు లక్ష్యం!

నందలూరు: నియోజకవర్గంలో లక్ష మందిని టీడీపీ సభ్యులుగా చేర్చి నూతన శకానికి నాంది పలకాలని, అందులో నందలూరు మండలం ముందుండాలని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం పిలుపు నిచ్చారు. ఆదివారం మండలంలోని నాగిరెడ్డిపల్లె పంచా యతీ ఎన్టీఆర్‌ నగర్‌లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ రీజి యనమాజీ చైర్మన యెద్దల సుబ్బరాయుడు, జిల్లా లీగల్‌సెల్‌ నాయకుడు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ లు కడవకూటి సాయిబాబా, పల్లె సుబ్రమణ్యం, తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 11:21 PM