Share News

దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టిన పోలీసులు

ABN , Publish Date - Sep 27 , 2024 | 10:56 PM

పులివెందుల పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.

దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టిన పోలీసులు
కార్మికులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న డీఎస్పీ మురళీనాయక్‌

అంతర్రాష్ట్ర కార్మికులకు డీఎస్పీ కౌన్సెలింగ్‌

పులివెందుల టౌన, సెప్టెంబరు 27 : శుక్రవారం డీఎస్పీ మురళీనాయక్‌ పులివెందులకు పనుల కోసం పశ్చిమబెంగాల్‌ నుంచి వచ్చిన 36 మందిని చత్తీ్‌సగడ్‌కు చెందిన 30 మంది, మధ్యప్రదేశకు చెందిన 20 మందికి ఉత్తరప్రదేశ, ఒడిస్సాలకు చెందిన 10 మందిని స్టేషనకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వారి వివరాలు, వేలిముద్రలను నమోదు చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పులివెందుల పట్టణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు ఎవరనా వస్తే తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన ఇన్సపెక్టర్‌, సబ్‌ ఇన్సపెక్టర్‌లు, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 10:56 PM