Share News

లోక రక్షకుడు యేసు ప్రభువు

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:13 AM

లోక రక్షకుడు యేసు ప్రభువు అని, సర్వమానవాళిని సన్మార్గంలో నడిపించేందుకు ఆయన దివి నుంచి భువికి దిగివచ్చారని ప్రభుత్వ విప్‌, కడప ఎమ్మెల్యే మాధవి అన్నారు.

లోక రక్షకుడు యేసు ప్రభువు
కడప కలెక్టరేట్‌లో నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ మాధవి

కడప కలెక్టరేట్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): లోక రక్షకుడు యేసు ప్రభువు అని, సర్వమానవాళిని సన్మార్గంలో నడిపించేందుకు ఆయన దివి నుంచి భువికి దిగివచ్చారని ప్రభుత్వ విప్‌, కడప ఎమ్మెల్యే మాధవి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మ స్‌ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ సెమీక్రిస్మస్‌ వేడుకలను తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించ డం సంతోషించదగ్గ విషయమన్నారు. జిల్ల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ ప్రజల్లో శాంతి, ప్రేమ, దయాగుణం నింపడానికి యేసుప్రభువు జన్మించారన్నారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దయామయుడు యేసుక్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఇమ్రాన, కైస్త్రవ మత పెద్దలు శ్యామ్యూల్‌, విజయభాస్కర్‌, ప్రభుదాస్‌, జాన మహేష్‌, టీడీపీ ఎస్టీ సెల్‌ నాయకులు, రమేష్‌ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

యేసుక్రీస్తు మార్గంలో నడవాలి: ఆర్డీఓ

లోక రక్షకుడు యేసుక్రీస్తు సూచించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కడప ఆర్డీఓ జాన ఇర్విన పేర్కొన్నారు. క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మేనేజరు అరుణ కుమార్‌తో కలిసి కడప అమ్మఒడి అనాథ విద్యార్థులచే అల్పాహారం అందించారు. అలాగే బృంద, పద్మావతి వృద్ధాశ్రమాల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 25 , 2024 | 12:13 AM