దిమ్మెల ఏర్పాటును అడ్డుకున్న దుకాణదారులు
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:47 PM
ములకలచెరువులో ముంబాయి - చెన్నై జాతీ య రహదారి విస్తరణ పనుల్లో భాగంగా దుకాణాల ముందు అడ్డుగా దిమ్మెలు ఏర్పా టు చేస్తుండగా దుకాణదారులు అడ్డుకున్నా రు.
పనులు చేయిస్తున్న సిబ్బంది, దుకాణదారుల వాగ్వావాదం
ములకలచెరువు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ములకలచెరువులో ముంబాయి - చెన్నై జాతీ య రహదారి విస్తరణ పనుల్లో భాగంగా దుకాణాల ముందు అడ్డుగా దిమ్మెలు ఏర్పా టు చేస్తుండగా దుకాణదారులు అడ్డుకున్నా రు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన మయినబాషా దుకాణదారులను పిలుచుకొచ్చి పనులు చేపట్టకుండా ఎక్స్‌కవేటర్‌కు అడ్డుగా దుకాణదారులతో కలిసి బైఠాయించారు. దుకాణాల ముందు దిమ్మెలు పెడితే వ్యాపారాలు జరగ వని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి వెళ్లేందుకు దారి, 108 వచ్చేందుకు కూడా వీలు ఉండదని వాపోయారు. పనులు చేయిస్తున్న సిబ్బంది, దుకాణదారుల మధ్య వాద్వాదం చోటు చేసుకుంది. దీంతో సీఐ రాజారమేష్, ఎస్‌ఐ గాయత్రిలు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తంబ ళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరపల్లి జయచంద్రారెడి సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. దుకాణదారులతో మాట్లాడి రోడ్డుకిరువైపులా ప్రతి 30 మీటర్లకు ఆటో వెళ్లే విధంగా దారి వదలా లని పనులు చేయిస్తున్న సిబ్బందికి తెలియజేశారు. దీనికి దుకాణదారులు కూడా సమ్మతించ డంతో సమస్య పరిష్కారమైంది. ఈ కార్యక్రమంలో దుకాణదారుల సంఘం అధ్యక్షుడు మతీన బాషా, నాయకులు రియాజ్, శ్రీరాములులతో పాటు పెద్దఎత్తున దుకాణదారులు పాల్గొన్నారు.