Share News

యేసు మార్గం అనుసరణీయం

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:06 AM

దేవుని మార్గం అనుసరణీయమని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రధాన ఆచార్యులు ఎస్‌.రఘునాథరెడ్డి అన్నారు.

యేసు మార్గం అనుసరణీయం
ప్రార్థనలలో పాల్గొన్న ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రఘునాథరెడ్డి, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ పద్మ

కడప ఎడ్యుకేషన, డిసెంబరు 19 (ఆంఽధ్రజ్యోతి): దేవుని మార్గం అనుసరణీయమని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రధాన ఆచార్యులు ఎస్‌.రఘునాథరెడ్డి అన్నారు. గురువారం విశ్వవిద్యాలయలో విద్యార్థుల ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆచా ర్య రఘునాథరెడ్డి, విశిష్ట అతిథి ఆచార్య పద్మ, దైవ సందేశకులు బెన్నీ ప్రసాద్‌ కేక్‌ కట్‌ చేసి ముందస్తు క్రిస్మస్‌ వేడుకలను ప్రారంభించా రు. ప్రధానాచార్యులు రఘునాథరెడ్డి ముఖ్యఅతిథగా హాజరై క్రిస్మస్‌ ఇచ్చే సందేశంగా ఇతరులకు ఇవ్వటంలో ఆనందం ఉందన్నారు. నిస్వార్థంగా ఉండాలని, దేవుడు లోకాన్ని ప్రేమించడానికి వచ్చాడని చెప్పారు. కులసచివులు ఆచార్య పద్మ మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒక్కటే అని, శాంతిని దయను సేవా భావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. ఇలాంటి పండుగల సందర్భంలోనే ఏ మతంవారమైనా అందరం ఒక తాటిమీదికి రావాలని కోరారు. బెన్నీ ప్రసాద్‌ మాట్లాడుతూ దేవుడి మీద నమ్మకం మనల్ని ఉన్నతంగా జీవించేలా చేస్తుందన్నారు. ఆయన తన జీవితాన్ని ఒక ఉదాహరణగా చెప్పారు. టెన్త ఫెయల్‌ అయి గోవాకు పారిపోయిన దశ నుంచి ఆస్తమా నుంచి బయటపడి, మ్యూజిక్‌ ప్లేయర్‌గా ఎదిగి ఢిల్లీలోని ప్రముఖమైన శ్రీరామ్‌ కళాశాల స్పీకర్‌ అయిన క్రమాన్ని వివరించారు.అలుమ్ని జాన్సన ఆధ్వర్యంలో ఆలపించిన గీతాలు అలరించాయి. ట్రైన్సలేటర్‌గా సాల్మన వ్యవహరంచారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 12:06 AM