Share News

భూమిని అక్రమించి..మాపైనే కేసులు పెడుతున్నారు

ABN , Publish Date - Oct 09 , 2024 | 11:54 PM

మా భూ ములు ఆక్రమించడ మే కాకుండా ప్రశ్నించి నందుకు మాపైనే అక్రమ కేసులు బనా యిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ఓ రైతు కుటుం బం సబ్‌కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టింది.

 భూమిని అక్రమించి..మాపైనే కేసులు పెడుతున్నారు
పెట్రోల్‌ బాటిల్‌ చూపిస్తూ ఆందోళన చేస్తున్న రైతు

సబ్‌కలెక్టరేట్‌ ఎదుట రైతు కుటుంబం ఆందోళన

మదనపల్లె టౌన, అక్టోబరు 9: మా భూ ములు ఆక్రమించడ మే కాకుండా ప్రశ్నించి నందుకు మాపైనే అక్రమ కేసులు బనా యిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ఓ రైతు కుటుం బం సబ్‌కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టింది. బుధవారం స్థానిక సబ్‌ కలె క్టరేట్‌ ఎదుట మదనపల్లె మం డలం వేంపల్లె గ్రామానికి చెందిన రైతు అమర నారాయణ కుటుంబం పెట్రోల్‌ బాటిల్‌తో వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అమరనారాయణ, ఆయన కుమారుడు శ్రీనివాసులు మాట్లాడు తూ వేంపల్లె గ్రామం బండకా డపల్లెకు చెందిన తమ భూమి, ఇంటి స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు ఆక్రమిం చుకున్నారని ఐదేళ్లుగా ఈ వివాదంపై రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యా దు చేసినా న్యాయం జరగక పోగా తాము ఫిర్యా దు చేసిన వ్యక్తులు తమ కుటుంబపైనే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టించారన్నారు. ఈ విషయమై తమకు న్యాయం జరగకుంటే ఇంటిల్లిపాది ఆత్మహత్యే శరణ్యమని చెప్పారు. కార్యక్రమంలో అమరనారాయణ కుటుంబీ కులు శ్రీనివాసులు, మమత, పద్మ, మహేష్‌, దేశాంత పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2024 | 11:54 PM