Share News

చిన్నారి అస్ఫియా హత్య దోషులకు ఉరి శిక్ష విధించాలి

ABN , Publish Date - Oct 05 , 2024 | 12:22 AM

చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అస్ఫియాను కిడ్నాప్‌ చే సి, హత్య చేసిన దోషులకు ఉరి శిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్లీం మైనారిటీలు డిమాండ్‌ చేశారు.

చిన్నారి అస్ఫియా హత్య దోషులకు ఉరి శిక్ష విధించాలి
సబ్‌కలెక్టరేట్‌ వద్ద ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లీంలు, మద్దతిచ్చిన ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, అక్టోబరు 4: చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అస్ఫియాను కిడ్నాప్‌ చే సి, హత్య చేసిన దోషులకు ఉరి శిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్లీం మైనారిటీలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక జామియా మసీ దు నుంచి సబ్‌కలెక్టరేట్‌ వరకు ముస్లీంలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సబ్‌కలెక్టరేట్‌కు చేరుకున్న ర్యాలీకి మద్దతుగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహానబాషా మాట్లాడుతూ పుంగ నూరులో అస్ఫియా హత్య ఘటనపై చిత్తూరు ఎస్పీతో చర్చించానన్నారు. ఈ హత్య వెనుక వున్న దోషులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నా రు. పోలీసులు కూడా బాధ్యతగా కేసు ధర్యాప్తు చేస్తున్నారన్నారు. . రెండు రోజుల్లో ఈ హత్య కేసును పోలీసులు చేధిస్తారని ఆశిస్తున్నామన్నారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌కు వినతి పత్రం అందజేశారు.

వాల్మీకిపురంలో: చిన్నారి అస్ఫియా హత్య ఉదంతం బాధాకరమని వాల్మీకిపురం జేఏసీ విచారం వ్యక్తం చేసింది. శుక్రవారం రాత్రి వాల్మీకిపురంలో అస్ఫియా మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ కొవ్వొత్తులతో పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్‌ వద్ద చిన్నారి అస్ఫియా మరణానికి కారకులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అన్ని మతాల పెద్దలు, ప్రజలు, యువత పాల్గొన్నారు.

కలకడలో: పుంగనూరులో చిన్నారి అస్ఫియా మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కలకడలోని ముస్లింలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అస్ఫియా మృతిని నిరసిస్తూ కలకడలోని ముస్లింలు శుక్రవారం సాయంత్రం స్థానిక బిలాల్‌ మసీదు నుంచి బస్టాండు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి అక్కడ కొవ్వొత్తులు వెలిగించి అస్ఫియా ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు.

Updated Date - Oct 05 , 2024 | 12:22 AM