బెదిరింపులు, షోకాజ్ నోటీసులు లక్ష్యాన్ని సాధించలేవు
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:56 PM
బెదిరింపులు, షోకాజ్ నోటీసులు లక్ష్యాన్ని సాధించలేవని ఎస్టీయూ నేతలు పేర్కొన్నారు.
డీఈఓకు ఎస్టీయూ వినతి
కడప ఎడ్యుకేషన, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : బెదిరింపులు, షోకాజ్ నోటీసులు లక్ష్యాన్ని సాధించలేవని ఎస్టీయూ నేతలు పేర్కొన్నారు. జిల్లాలో అపార్ విద్యార్థుల జనరల్ ప్రొఫైల్ వంద శాతం సాధించలేదని జిల్లా వ్యాప్తంగా 829 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. బుధవారం డీఈఓ కార్యాలయంలో డీఈఓ మీనాక్షికి వినతిపత్రం అందించారు. అనంతరం వారుమాట్లాడుతూ అపార్ కేవలం ప్రధానోపాధ్యాయులకు మాత్రమే కాదని, పి ల్లలు, తల్లిదండ్రుల సాంకేతికతతో ముడిపడి ఉన్న అంశమన్నారు. జిల్లా వ్యాప్తంగా అతి త్వరలో దాదాపు 85 శాతం పూర్తి చేయడం శుభపరిణామమన్నారు. మిగిలిన 15 శాతం అనేక సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న కారణంగా కొంచెం ఆలస్యమవుతుందన్నారు. దీనికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని, తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కె.సురేశబాబు, రాష్ట్రనాయకులు రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఇలియా్‌సబాషా, నాయకులు గురుకుమార్, చెన్నకేశవరెడ్డి, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీఎఫ్ : ప్రధానోపాఽధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఆక్షేపణీయమని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
పీఎస్టీయూ: ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీఎస్టీయూ రాష్ట అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజనేయరెడ్డి, జిల్లాఉపాధ్యక్షుడు సీవీ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్వీ సుబ్బారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కన్వీనరు మజ్జా అరుణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపసంహరించుకోకుంటే డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు విజయకుమార్, మహేశబాబు అన్నారు. బుధవా రం వారు డీఈఓ కార్యాలయం ఎదుట వర్షంలో గొడుగులతో వినూత్న నిరసన చేపట్టారు. జిల్లాలో 20 శాతం ఇంకా పూర్తికావాల్సి ఉండగా నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని తక్షణం షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ నాయకులు నరసింహారావు, ఎజాజ్ అహ్మద్, ప్రభాకర్, సీవీ రమణ పాల్గొన్నారు.