Share News

నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాలి

ABN , Publish Date - Oct 27 , 2024 | 11:45 PM

అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నగర వనం పట్టణ ప్రజలకు ఆహ్లా దాన్ని పంచే విధంగా ఏర్పా ట్లు చేయాలని ఎమ్మెల్యే షాజ హాన బాషా ఆదేశిం చారు.

నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాలి
నగరవనంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే షాజహాన బాషా

నగరవనం పరిశీలనలో ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నగర వనం పట్టణ ప్రజలకు ఆహ్లా దాన్ని పంచే విధంగా ఏర్పా ట్లు చేయాలని ఎమ్మెల్యే షాజ హాన బాషా ఆదేశిం చారు. ఆదివారం స్థానిక పుంగనూ రు రోడ్డులోని నగర వనాన్ని ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన రూ.2కోట్ల నిధులతో నగరవనాన్ని మదనపల్లెలో నిర్మిస్తుండటం ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు అహ్లాదాన్ని పంచడంతో పాటు ఇక్కడ వాకింగ్‌ ట్రాక్‌, గేమింగ్‌ జోన, మెడిటేషన సెంటర్లు, యోగా కేంద్రాలకు అనువుగా ఉందన్నారు. ఎఫ్‌ ఆర్‌వో వేణుగోపాల్‌ మాట్లాడుతూ నామమాత్రం ఎంట్రీ ఫీజుతో పట్టణంలోని 2లక్ష ల మందికి అందుబాటులోకి నగర వనాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. డీఆర్‌వో మదనమోహన, ఎఫ్‌బీవో త్యాగరాజు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 11:45 PM