Share News

నేటి బాలలే రేపటి పౌరులు

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:45 AM

నేటిబాలలే రేపటి పౌరులని, వారిని దేశప్రయోజకులుగా తీర్చిదిద్దాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.బాబాపక్రుద్దీన్‌ అన్నారు.

నేటి బాలలే రేపటి పౌరులు
సాయిబాబా స్కూలులో మాట్లాడుతున్న కార్పొరేటరు శ్రీదేవి

సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబాపక్రుద్దీన్‌

కడప రూరల్‌, నవంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి) : నేటిబాలలే రేపటి పౌరులని, వారిని దేశప్రయోజకులుగా తీర్చిదిద్దాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.బాబాపక్రుద్దీన్‌ అన్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ అంధుల బా లుర పాఠశాలలో న్యాయవిజ్ఙాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జడ్జి మాట్లాడుతూ భారతదేశ మొదటి ప్ర ధాన మంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రతి విద్యార్థీ చక్కగా చదువుకొని లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. బాలల సంరక్షణకు న్యాయసేవాధికార సంస్థ స్నేహపూర్వ క న్యాయసేవల పథకం 2015 గురించి వివరించారు. అనంతరం జడ్జి హియరింగ్‌ మిషన్లను పంపిణీచేసి వైద్యాధికారులచేత ఆడి యో మెట్రేషన్‌ టెస్టులు నిర్వహింపజేశారు.

పులివెందులలో...

నెహ్రూ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక జేఎన్టీయూ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ డి.విష్ణువర్దన, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.శేషమహేశ్వరమ్మ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్‌.తుమ్మలపల్లె అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం నిర్వహించారు. డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స డాక్టర్‌ ఎ.సాంబయ్య, పాల్గొన్నారు.

వేంపల్లెలో...

కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు నెహ్రూ చిత్రాపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చైతన్య హైస్కూల్లో బాలల దినోత్సవం నిర్వహించారు. కరస్పాండెంట్‌ చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. చిన్నారులు ప్రదర్శనతో అందరిని అలరించారు.

సాయిబాబా పాఠశాలలో...

కడప నగరం అక్కాయపల్లె సాయిబాబా పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కార్పొరేటరు ఎంవీ శ్రీదేవి, సాయిబాబా విద్యాంసంస్థల వైస్‌ చైర్మన సాయిసుధీర్‌ కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుబ్బరాయుడు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:45 AM