Share News

టమోటా వైపు.. రైతన్న చూపు

ABN , Publish Date - Oct 24 , 2024 | 11:42 PM

పంట సాటులో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న రైతులు టమోట పంట సాగుకు అడుగులు వేస్తూనే ఉన్నారు.

టమోటా వైపు.. రైతన్న చూపు
కలిచెర్ల సమీపంలో ప్రారంభ దశలో ఉన్న టమోటా పంట తోట పూత దశలో మందులు పిచికారి చేస్తున్న రైతులు

సాగు ఖరీదైనా ముందుకెళ్తున్న వైనం

వేరుశనగ పంటతో దెబ్బతిన్న రైతన్న టమోటా సాగుకు నడుంబిగించారు

పెద్దమండ్యం, అక్టోబరు24 (ఆంధ్రజ్యోతి):పంట సాటులో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న రైతులు టమోట పంట సాగుకు అడుగులు వేస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా టమోట పంట సాగు విస్తారంగా పెరిగింది. కారణం ఆశించి న స్థాయిలో టమోట ధరలు పెరగడమే. ఖరీఫ్‌లో వేరుశనగ పంట వర్షాభావ పరిస్థితులతో అశించిన స్థాయిలో దిగబడులు లేక రైతులు నష్టాలు చవిచూశారు. దీంతో ఈ ప్రాంత రైతులు వ్యవసాయబోర్ల కింద టమోటా సాగుకు మొగ్గు చూపుతు న్నారు. అలాగే గతంలో టమోటా సాగు చేసిన రైతులు ఆర్థి కంగా నష్ట పోయారు. గత రెండు నెలలుగా 30 కిలోల బాక్స్‌ ఽటమోట కాయలు నాణ్యత బట్టి రూ. 300 నుంచి రూ. 1500 వరకు ధర పలుకుతోందని రైతులు తెలిపారు. ఇటీవల 15 కిలోల కిరిట్‌ 5వందల నుంచి 7వందల వరకు ధర పలుకు తోంది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో తదితర ప్రాంతాలలో సుమారు 35 వేల ఎకరాల్లో టమోట పంట సాగులో ఉందని అధికారులు తెలిపారు. వ్యవసాయ బోరు వున్న ప్రతి రైతు అధి కంగా టమోటీ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఒక ఎకరానికి టమోట పంట సాగు చేయాలంటే రైతుకు రూ. 1. 30 లక్షల నుంచి 2 లక్షలు పెట్టుబడి ఖర్చవుతుందన్నారు. భూ మి సేద్యంతో పాటు కవర్‌, ఎరువులు, పిచికారి మందులు అధి క పెట్టుబడి పెట్టాల్సి ఉందన్నారు. అయినా టమోటా సాగుకు పలువురు రైతులు వెనకంజ వేయడం లేదు. ఎకరానికి టమోట ఒక కోతకు 30 కిలోల బాక్స్‌లు 80 నుంచి 100 బాక్స్‌లు వస్తు న్నాయి. ఇతర ప్రాంతాల రైతులు కూడా భూమి లీజు తీసుకొని టమోటా పంట సాగు చేస్తున్నారు. ఈ ఏడాదిలో ప్రస్తుతం సాగులో ఉన్న టమోట పంటకు మాత్రమే ఽఅశించిన స్థాయిలో గిట్టుబాటు ధరలు వచ్చాయి. రెండు నెల లుగా టమోట ధరలు ఆశించిన స్థాయిలో నిలకడగా ఉన్నాయని రైతులు తెలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి కొంత టమోట ధరలు తగ్గుముఖం పట్టా యి. కారణం టమోటా ఎగుమతులు లేకపోవడమే. కానీ ఈ ప్రాంతంలో అతి భారీ పర్షాలు లేకపోవడంతో టమోటా రైతు ఊపిరి పీల్చుకున్నారు. పంట 10 రోజులు తెగుళ్లు సోకే అవకాశం ఉందని మందులు సకాలంలో పిచికారి చేయాలని హర్టికల్చరర్‌ అధికారులు సూచిస్తున్నారు. పంట దిగుబడి, ధరలు తగ్గితే పంట నష్టాల పాలు చేస్తుంది. ఇటీవలె ఎగువ రాష్ట్రాలలో భారీ వర్షాలు తగ్గితే ఇక్కడ మళ్లీ టమోటకు ధరలు భారీగా పలుకు తున్నాయని రైతులు తెలిపారు. ప్రస్తుతం ధరలు కొనసాగితే రైతుకు గిట్టుబాటు అవుతోందన్నారు. ప్రస్తుతం టమోట పంట తోటలను రైతులు పోటీపడి సాగు చేస్తున్నట్లు తెలిపారు. కరువు రైతులకు ఈ పంట ఊరట నిచ్చింది. ఈ వర్షాలతో జిల్లాలో భూగర్భ జలాలు పెరిగి టమోట సాగు మరింత పెరుగుతున్నది.

లాభ నష్టాలు చూడాల్సిందే...

టమోటా పంట సాగు చేసే ప్రతి రైతు లాభ నష్టాలు చవి చూడాల్సిందే. కానీ ఈ పంట జూదం లాంటిది. టమోటా పం ట సాగు సాహసంతో కూడుకున్నది. ఎకరానికి రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాలి. పంట లాభం వస్తే పర్వాలేదు. కానీ నష్టం వస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం టమోట కు ఆశించిన స్థాయిలో ధరలు పలుకుతున్నాయి.

- సోమశేఖర్‌. రైతు. పెద్దమండ్యం

Updated Date - Oct 24 , 2024 | 11:43 PM