Share News

ఫ్రీ హోల్డ్‌, చుక్కల భూములపై విచారణ చేపట్టండి

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:44 PM

ఫ్రీ హోల్డ్‌ భూములతో పా టుగా చుక్కల భూములపై పకడ్బం దీగా విచారణ చేపట్టాలని ఇనఛార్జ్‌ ఆర్డీవో రాఘవేంద్ర పేర్కొన్నారు.

ఫ్రీ హోల్డ్‌, చుక్కల భూములపై విచారణ చేపట్టండి

కురబలకోట, నవంబరు 6(ఆంధ్ర జ్యోతి): ఫ్రీ హోల్డ్‌ భూములతో పా టుగా చుక్కల భూములపై పకడ్బం దీగా విచారణ చేపట్టాలని ఇనఛార్జ్‌ ఆర్డీవో రాఘవేంద్ర పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కురబల కోట తహశీల్ధార్‌ కార్యాలయాన్ని ఆ యన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం నిర్ధేశించిన మేరకు సిబ్బంది గ్రామాలకు వెళ్లి భూముల విచారణ చేపట్టడంతో పాటుగా తప్పనిసరిగా తప్పులు లేకుండా సర్వే చేయాలన్నారు. ప్రధానంగా ఫ్రీహోల్డ్‌ భూములతో పాటుగా చుక్కల భూములకు సంబంధించి సర్వేలను త్వరగా పూర్తి చేయడంతో పాటుగా ఏవైన సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో తహశీల్థార్‌ తపశ్విని, ఆర్‌ఐ బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: చుక్కల భూముల విషయంలో ఎక్కడా సమస్యలు రాకుండా చర్య లు తీసుకోవాలని మదనపల్లె ఇనఛార్జి ఆర్‌డీవో రాఘవేంద్ర ఆదేశించారు. బుధవారం వాల్మీకిపురం రెవెన్యూ కార్యాలయంలో చుక్కల భూముల క్రమబద్దీకరణపై గత వారం రోజులుగా మండల వ్యాప్తంగా జరుగుతున్న రీ వెరిఫికేషన ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చుక్కల భూముల వివరాలను తిరిగి పరిశీలిస్తూ ఈనెల 15లోగా పూర్తి చేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరిం చాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇనస్పెక్టర్‌ సుగుణ, సర్వేయర్‌ పూర్ణచంద్ర, వీఆర్‌వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:44 PM