వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి
ABN , Publish Date - Oct 12 , 2024 | 12:58 AM
వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని వాల్మీకి మహాసేన నాయకులు ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.
మదనపల్లె అర్బన, అక్టోబరు11: వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని వాల్మీకి మహాసేన నాయకులు ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడు తూ దేశంలో కొన్ని చోట్ల వాల్మీకులను ఎస్టీలుగానూ, మ రికొన్ని చోట్ల బీసీలుగానూ వ్యత్యా సాలు చూపడం దారుణమన్నారు. దీంతో వాల్మీకులకు అందాల్సిని రిజర్వేషన ఫలాలు అందడంలేదని చెప్పారు. ఈ నెల 17న వాల్మీకి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా పండు గలా జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ట తాము ఆనందం వ్యక్త చేస్తున్నట్లు చెప్పారు. వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటిం చాలని కోరారు. కార్యక్రమంలో వాల్మీకి మహాసేన రాష్ట్ర నాయకు డు విజయ్‌కుమార్, జిల్లా నాయకుడు ముత్తరాశి హరికృష్ణ, నాయకులు రవి, శ్రీన,మునుస్వామి, బంవగారు శంకర, బొగ్గిటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.