ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనైతిక చర్య
ABN , Publish Date - Dec 13 , 2024 | 11:46 PM
అభిమానంగా ఏర్పాటు చేసుకున్న అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనైతిక చర్య అని ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి తెలిపారు.
కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి
పెండ్లిమర్రి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అభిమానంగా ఏర్పాటు చేసుకున్న అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనైతిక చర్య అని ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి తెలిపారు. ధ్వంసమైన ఎన్టీఆర్ విగ్రహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపల్లె గ్రామ సమీపంలో రైతు కొప్పల వెంకటసుబ్బయ్య తన పొలంలో ఇష్టంగా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వసం చేయడ దారుణమన్నారు. 2022 జనవరి 1వ తేదీన కమలాపురం టీడీపీ ఇనచార్జ్ పుత్తా నరసింహారెడ్డిచే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ విగ్రహం మెడ వరకు పగులగొట్టి చెయ్యి విరగొట్టారని పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. ఈ ఘటన వెనుక ఉన్నవారు ఎంతటివారినైనా చట్టానికి అప్పగించి శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. అదే స్థలంలో త్వరలో మరో విగ్రహం ఆవిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డి, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.