వాల్టా..ఉల్టా..!
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:44 PM
ప్రభుత్వ నియమనిబంధనలు తుంగలో.. వాల్టా చట్టం ఉల్లంఘన వెరసి కలప అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించు కునేనాథుడే కరువయ్యారు.
మామూళ్లు ఇస్తే రైట్.. రాత్రి, పగలూ తేడా లేదు..
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా చోద్యం చూస్తున్న అటవీ శాఖ అధికారులు
వాల్మీకిపురం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నియమనిబంధనలు తుంగలో.. వాల్టా చట్టం ఉల్లంఘన వెరసి కలప అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించు కునేనాథుడే కరువయ్యారు. వాల్మీకిపురం నుంచి మదనపల్లెకు కలపను అక్రమ మా ర్గంలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా తరలించుకుపోతుండటం గమనార్హం. స్థానిక బైపాస్ రోడ్డులో రహదారి పక్కగా అటవీ శాఖ కార్యాలయం ఉండగా కలప అక్ర మ రవాణా జోరుగా సాగుతున్నా ఓల్టా చట్టం ఉల్లంఘిస్తున్నా దీనిపై ఏనాడూ అఽధికారులు చర్యలు తీసుకోవడం లేదని సర్వత్రా విమర్శలున్నాయి. అయితే అట వీ అధికారులే మామూళ్లకు అలవాటు పడి కలప అక్రమ రవాణాకు సహకరిస్తు న్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. స్థానికంగా టింబర్ యజమానులు కలప అక్రమ రవాణాలో అదనుగా ఎర్రచందనం దుంగలు రహస్య మార్గంలో తీసుకెళ్తున్నట్లు సమాచా రం. వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల నుంచి ప్రభుత్వ భూములలోని చెట్లను అక్ర మంగా నరికివేస్తున్నా సంబంధిత అధికారుల చర్యలు మాత్రం అంతంతంగా ఉన్నాయనడా నికి ఈ అక్రమ రవాణా కార్యకలాపాలే ప్రత్య క్ష నిదర్శనం. అటవీ శాఖ అధికారులు సైతం అక్రమార్కులకు సహకరిస్తున్నట్లు చర్శాంచనీ యంగా మారింది. ప్రతి రోజు వాల్మీకిపురం నుంచి మదనపల్లెకు సుమారు పది ట్రాక్టర్లు పైగా ఓవర్‌లోడుతో కానుగ, వేప, నీలగిరి తదితర కలప అక్రమంగా తరలించుకుపో తున్నారు. మరి కొన్ని ప్రాంతాలలో చెరువులలోని కలప ను సైతం చెరబట్టి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటూ గ్రామస్థులు అడ్డుపడిన సమ యాలలో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు కలప అక్రమ రవా ణా ను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అక్రమ రవాణాపై నిఘా పెట్టాం..
వాల్మీకిపురం మండలం వ్యాప్తంగా కలప అక్ర మ రవాణాపై గట్టి నిఘాపెట్టి ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తు న్నాం. అనుమతులు లేకుండా చెట్లు నరికివేతకు పాల్పడి నా, కలప అక్రమ రవాణా చేసినా చట్టరీత్యా ఖచ్చి తమైన చర్యలు తీసుకుంటాం. ఇకపై అక్రమ రవాణా జరుగ కుండా నిఘా చర్యలు ఉంటాయి. టింబర్ వ్యాపారులు నిబంధన లు పాటించాలి. అటవీ సిబ్బంది కూడా బాధ్యతగా విధు లు నిర్వర్తించాలి. సిబ్బందిపై ఎలాంటి అవినీతి ఆరోప ణలు వచ్చినా తగు చర్యలు ఉంటాయి.
- సుధాకర్, అటవీశాఖ అధికారి,
వాల్మీకిపురం