Share News

వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:21 PM

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు.

వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న వలంటీర్ల అసోసియేషన సభ్యులు

నందలూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు. నందలూరులోని గ్రామ,వార్డు వలంటీర్ల అసోసియేషన స భ్యులు మంగళవారం ఈ మే రకు ఎంపీడీవో సుజాతమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, 10 వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని కూటమి నాయకులు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా ఇంకా జీతాలు కాని, ఉద్యోగ భద్రత కానీ, కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రావాల్సిన పెండింగ్‌లో ఉన్న జీతాలను 10 వేల రూపాయల గౌరవ వేతనాన్ని తక్షణమే మంజూరు చేసి వలంటీర్లను ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంపీడీవో సుజాత మాట్లాడుతూ వినతిపత్రాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వలంటీర్లు సాయికృష్ణ, సుబ్రమణ్యంరెడ్డి, కమల్‌, సుధీర్‌, సునీల్‌, సుధా, అబ్దుల్‌ రహమాన, సుధారాణి, పావని, నూతన, ఉమామహేశ్వరి, మాణిక్యమ్మ, జ్యోతి, సుజిత, కవిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 11:21 PM