Share News

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి

ABN , Publish Date - Nov 09 , 2024 | 11:43 PM

మదనపల్లె సర్వజన బోధనాస్పత్రి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పెం డింగ్‌ వేతనాలు వెంటనే చెల్లిం చాలని ఆ సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి
ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట నిరసన తెలియచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

మదనపల్లె అర్బన, నవంబరు9: మదనపల్లె సర్వజన బోధనాస్పత్రి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పెం డింగ్‌ వేతనాలు వెంటనే చెల్లిం చాలని ఆ సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మూడో రోజు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ సర్వజన బోధనాస్పత్రి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఆప్కాస్‌లోకి తీసుకోవాలని, ఎనిమిది నెలలుగా పెండింగ్‌ ఉన్న జీతాల ను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఉన్నతాధికారులు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌కు, సబ్‌క లెక్టర్‌కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిం దన్నారు. చాలాసార్లు ఆందోళనలు చేపట్టినా సమస్యకు ఉన్నతాధికారులు పరిష్కా రం చూపలేదని వాపోయారు. ఇప్పటికైన కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చొరవ చూపి వారికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:43 PM