వార్డు సచివాలయ నిర్వహణ లోపభూయిష్టం
ABN , Publish Date - Dec 14 , 2024 | 12:07 AM
ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అన్ని రకాల సేవలు అందించడా నికి నెలకొల్పిన సచివాలయాల నిర్వహణ లోపభూయిష్టంగా మా రిందని మదనపల్లె ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు.
సచివాలయ సిబ్బంది విధులకు డుమ్మా ఎమ్మెల్యే తనిఖీలో బట్టబయలు
మదనపల్లె టౌన, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అన్ని రకాల సేవలు అందించడా నికి నెలకొల్పిన సచివాలయాల నిర్వహణ లోపభూయిష్టంగా మా రిందని మదనపల్లె ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు. బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన సచివాల య సిబ్బంది విధులకు డుమ్మా కొట్టడం, ఎలాంటి అనుమతి లేకుండా గైర్హాజరు అయిన ఘటన ఎమ్మెల్యే షాజహానబాషా తనిఖీలో బట్టబయలు అయ్యింది. శుక్ర వారం మదనపల్లె పట్టణం దొంతివీధిలోని వార్డు సచివాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ విధులు నిర్వహించాల్సిన సిబ్బంది ఎలాంటి లీవు లెటర్ పెట్టకుండా డుమ్మా కొట్టారు. ఒకరిద్దరు హాజరైనా మిగిలిన వారు క్షేత్రస్థాయిలో విధులకు హాజరైతున్నట్లు చెప్పారే కాని మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో నమోదు చేయలేదు. దీనిపై అక్కడి ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధ్యతగా పనిచేయాల్సిన సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరిం చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు డుమ్మా కొట్టిన సిబ్బందికి మెమోలు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీలను ఆదేశించారు. వీరిపై విచారణ నిర్వహించి ఎందుకు సస్పెండ్ చేయకూడదో సంజాయిషి కోరాలని కమిషనర్‌కు సూచించారు. అనంతరం ఇందిరానగర్‌లో మసీదు వద్ద కాలువపై రూ.2లక్షలతో కల్వర్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.