ప్రతిరోజు నీటి సరఫరా చేయాలి: కమిషనర్
ABN , Publish Date - Dec 18 , 2024 | 11:51 PM
కడప కార్పొరేషన పరిధిలో ప్రతిరోజు నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ మనోజ్‌రెడ్డి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.
కడప ఎడ్యుకేషన, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కడప కార్పొరేషన పరిధిలో ప్రతిరోజు నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ మనోజ్‌రెడ్డి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. బుధవారం కడప నగరం ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం బుగ్గ కాలనీలో ఇంజనీరింగ్ అధికారులు టౌనప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ కొత్తగా నిర్మించిన ట్యాంకర్ నుంచి ప్రతి రోజు నగర ప్రజలకు తాగునీటి సరఫరా చేయాలని సూచించారు. పాడైన ట్యాంకులను మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. ఎస్‌ఈ చెన్నకేశవరెడ్డి, ఈఈ ధనలక్ష్మి, డిప్యూటీ సిటీ ప్లానర్ రమణ తదితరులు పాల్గొన్నారు.