Share News

Galeru - Water గాలేరు - నగరి సుజల స్రవంతి ద్వారా గుంజనేరుకు నీరు

ABN , Publish Date - Sep 25 , 2024 | 10:39 PM

గాలేరు - నగ రి సుజల స్రవంతి ద్వారా రాబోయే రోజుల్లో గుంజనేరుకు అక్కడి నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన ద్వారా చెరువులకు నీరందించడంపై ముఖ్య మంత్రితో చర్చించామని రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.

Galeru - Water గాలేరు - నగరి సుజల స్రవంతి ద్వారా గుంజనేరుకు నీరు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌

ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌

పెనగలూరు, సెప్టెంబరు 25 : గాలేరు - నగ రి సుజల స్రవంతి ద్వారా రాబోయే రోజుల్లో గుంజనేరుకు అక్కడి నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన ద్వారా చెరువులకు నీరందించడంపై ముఖ్య మంత్రితో చర్చించామని రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. బుధవారం పెనగలూరు మండల పరిషత కార్యాలయ ప్రాంగణంలో ఎంపీడీవో వరప్రసాద్‌ అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాలేరు - నగిరి సుజల స్రవంతి ద్వారా రాబోయే రోజుల్లో గుంజనేరుకు అక్కడి నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన ద్వారా చెరువులకు నీరందించడంపై ముఖ్యమంత్రితో చర్చించామని తెలిపారు. పెన గలూరు చెరువుకట్టకు మరమ్మతులు చేయించ నున్నట్లు తెలిపారు. రక్షిత మంచినీరు, వీధుల్లో సిమెంటు రోడ్లు , గ్రామాల మధ్య లింకురోడ్లు, దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మండలంలోని 14 మంది గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ముక్కా రూపానందరెడ్డి ఫౌండే షన ట్రస్టు ద్వారా ఒక్కొక్కరికి 5 వేల రూపా యల వంతున ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రకటించారు. అంగన్వాడీ సిబ్బంది ప్రదర్శించిన ఆహార పదార్థాలను పరిశీలించారు. అంగన్వాడీ సిబ్బంది స్వయంగా తయారు చేసిన వంటలను రుచికి రుచి చూశారు. ఈ సమావేశంలో జన సేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, తహసీ ల్దారు సీహెచ ఇంద్రాణి, ఎంఈవోలు గిరి వరదయ్య, నాగసుబ్బరాయుడు, సీడీపీవో రాజే శ్వరి, హౌసింగ్‌ ఏఈ హరిప్రసాద్‌, టీడీపీ జన సేన నాయకులు నాగేశ్వరయ్యనాయుడు, కేఎన ఆర్‌, లేపాక శ్రీనివాసులరెడ్డి, బాబునాయుడు, దామోదర్‌నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు శ్రీని వాస నాయుడు, జి.రెడ్డయ్య, యానాదయ్య, గంగి నాయుడు,సత్యనారాయణనాయుడు పాల్గొన్నారు.

సిద్దవటం : బొగ్గుడివారిపల్లె సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2024 | 10:39 PM