Share News

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

ABN , Publish Date - Oct 22 , 2024 | 10:56 PM

కడప ని యోజకవర్గంలోని ప్రతి ప్రాం తాన్ని అభివృద్ధి చేస్తామని క డప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అన్నారు.

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే
మాట్లాడుతున్న కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి

్డకడప ఎడ్యుకేషన, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కడప ని యోజకవర్గంలోని ప్రతి ప్రాం తాన్ని అభివృద్ధి చేస్తామని క డప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అన్నారు. నగరంలోని సంజన్న సర్కిల్‌ నుంచి నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూలు డెరెక్టరు వివేకానందరెడ్డి వారిని ఘనంగా సత్కరించారు. ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలల్లోపు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే కడప నగరంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూలు డైరెక్టరు వివేకానందరెడ్డి, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 10:56 PM