Share News

వరద బాధితులందరికీ సాయమందిస్తాం

ABN , Publish Date - Sep 13 , 2024 | 11:15 PM

విజయవాడలో వరదలతో సర్వం నష్టపోయిన బాధిలందరికీ సీఎం చంద్రబాబునాయుడు సాయమం దిస్తున్నారని, ఆయన సూచనలతో తాము కూడా తమవంతు సహా యం అందిస్తున్నామని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.

వరద బాధితులందరికీ సాయమందిస్తాం
విజయవాడ సెంట్రల్‌లో వరద బాధితులకు సరుకులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

మదనపల్లె టౌన, సెప్టెంబరు 13: విజయవాడలో వరదలతో సర్వం నష్టపోయిన బాధిలందరికీ సీఎం చంద్రబాబునాయుడు సాయమం దిస్తున్నారని, ఆయన సూచనలతో తాము కూడా తమవంతు సహా యం అందిస్తున్నామని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. శుక్ర వారం విజయవాడ సెంట్రల్‌ నియో జకవర్గంలోని సింగ్‌నగర్‌, నందమూ రినగర్‌, రాధానగర్‌, బాంబేకాలని, రాయనపాడు, రాజీవ్‌నగర్‌, ప్రాంతాల్లో ఎమ్మెల్యే షాజ హాన బాషా నేరుగా ఇంటింటికి వెళ్లి వరద బాధితులకు సరుకుల కిట్లను పంపిణీ చేస్తు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వరద బాధితులను పరామ ర్శిస్తూ వారికి కావాల్సిన అన్ని వస్తువులను సమకూరుస్తున్నారన్నారు. మదనపల్లె ప్రజల నుంచి వచ్చిన ఆర్థిక సహాయంతో 3వేల కిట్ల సరుకులను, 500 గ్యాస్‌స్టౌవ్‌లను బాధితుల కు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విద్యాసాగర్‌, నాగా ర్జున గాంధీ, బాలుస్వామి, గణపతి తదితరులు పాల్గొన్నారు.

మేము సైతమంటూ విరాళాలు సేకరించిన విద్యార్థులు

ములకలచెరువు, సెప్టెంబరు 13: విజయవాడ వరద బాధితుల కోసం విద్యార్ధులు మేము సైతమంటూ విరా ళాల సేకరణకు ముందుకొచ్చారు. ము లకలచెరువులో శుక్రవారం స్థానిక శ్రీ శారదా విద్యామందిర్‌, ఆక్స్‌ఫర్డ్‌ ఇంట ర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్ధులు ర్యాలీగా వచ్చి విరాళాలు సేకరించారు. దుకాణా ల వద్ద, వారపు సంతలో రూ.10వేలు వి రాళాలు సేకరించారు. ఈ నగదను ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతామని ఉపాధ్యా యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్లు శ్రీవాణి, సనతకుమార్‌, ప్రిన్సిపల్‌ సిద్ధారెడ్డి, హెచఎం ప్రసాద్‌, ఆడ్మినిసే్ట్రటీవ్‌ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 11:15 PM