‘గురుకుల’ సమస్యలన్నీ పరిష్కరిస్తాం
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:18 PM
గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదు ర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. బుధవారం చంద్రాకాలనీనిలోని అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు.
4 ఎంపీఎల్‌టీ4:
మదనపల్లె టౌన, సెప్టెంబరు 4: గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదు ర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. బుధవారం చంద్రాకాలనీనిలోని అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలసి మధ్యాహ్న బోజనం తిని, సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ వసుంధర మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో 11 కేవీ విద్యుత లైన్లు వెళుతున్నాయని, వర్షం వస్తే గాలులకు తీగలు తగులుకుని నిప్పురవ్వలు రాలుతున్నాయని , ఎగువన వున్న ఇళ్లలోని మురుగునీరు గురుకుల పాఠశాల మీదుగా వెళు తోందని ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల స్నానాలకు సోలార్ హీటర్, అదనం గా ఆర్‌వో ప్లాంటు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. వీటిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. విద్యార్థినుల రక్షణతో పాటు మంచి ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు.