Share News

వైసీపీ నేతల దౌర్జన్యాలను అడ్డుకుంటాం

ABN , Publish Date - Sep 29 , 2024 | 11:20 PM

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకుంటామని ఇక వారి ఆటలు సాగనివ్వమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం వెల్లడించారు.

వైసీపీ నేతల దౌర్జన్యాలను అడ్డుకుంటాం
టీడీపీ ఇనచార్జి బాలసుబ్రమణ్యంతో నాయకులు

నియోజకవర్గ టీడీపీ ఇనఛార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం

రాజంపేట, సెప్టెంబరు 29 : నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకుంటామని ఇక వారి ఆటలు సాగనివ్వమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం వెల్లడించారు. ఆదివారం రాజంపేట, సిద్దవటం, సుండుపల్లె నాయకులు ఆయనతో భేటీ అయ్యారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను సుగవాసి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఇక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టి అన్ని సమస్యలను తక్షణం పరిష్కరిస్తామన్నారు. కలిసి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళతానన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పనపై వెంటనే దృష్టి పెడతామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వివాదాల్లోకి వెళ్లవద్దని, భూదందాలకు పాల్పడవద్దని, నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. వైసీపీ నేతలు చేసిన తప్పిదాల వల్లే రాష్ట్రంలో భారీ ఓటమిని చవిచూశారన్నారు. ఈ కార్యక్ర మంలో సిద్దవటం మండల నాయకులు, టీడీపీ పార్లమెంట్‌ కార్యదర్శి నాగమునిరెడ్డి, మాజీ సర్పంచ రాజశేఖర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట టీడీపీ నాయకులతో మాట్లాడుతూ వీరబల్లె మండలం వేల్పుల మిట్ట నుంచి ఒంటిమిట్ట మండలం చింత రాజుపల్లె వరకు తారురోడ్డు వేస్తే ఇరు మండలాలకు దూరం తగ్గి రాకపోకలు పెరుగుతాయని, కొండ ప్రాంతాలు అభివృది చెందుతాయని సుగవాసి తెలపగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఒంటిమిట్ట మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని, అన్ని గ్రామాలకు రోడ్లు, నీటివసతి, వైద్య సౌకర్యం కల్పిస్తామన్నారు. త్వరలో రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేస్తామని తెలిపారు. మండల టీడీపీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు ప్రముఖ మండల బీసీ నాయకులు, ఎలక్ర్టికల్‌ క్లాస్‌-1 కాంట్రాక్టర్‌ ఎస్వీ రమణ, చింతరాజు పల్లె గ్రామ నాయకులు రమణ, ఒంటిమిట్ట గ్రామ కమిటీ అధ్యక్షులు పత్తి సుబ్బరాయుడు, ఎంపీటీసీ సభ్యుడు సుంకేసుల బాషా, యువ నాయకులు ముద్దా కృష్ణారెడ్డి, శంకర్‌దాదా, దినేష్‌, చెన్నయ్య, పెంచలయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 11:20 PM