జిల్లా ఇనచార్జ్ మంత్రికి స్వాగతాలు.. వినతులు
ABN , Publish Date - Nov 05 , 2024 | 11:44 PM
జిల్లా పర్యటనకు వచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవితకు పలువురు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
పులివెందుల టౌన, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా పర్యటనకు వచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవితకు పలువురు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. అనంతపురం జిల్లా నుంచి కడపకు వెళుతూ మార్గమధ్యంలో పులివెందుల చేరుకున్న సవితకు టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇనచార్జి బీటెక్ రవి ఘన స్వాగతం పలికారు. అలాగే పులివెందుల పట్టణ మాజీ అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె వెంకట్రామిరెడ్డి, విజయకుమార్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
లింగాల: మంత్రి సవిత లింగాల మండలం అంబకపల్లె -ముదిగుబ్బ ఘాట్‌రోడ్డు వద్దకు చేరుకున్న సమయంలో బీటెక్ రవి టీడీపీ నాయకులతో కలిసి ఘనస్వాగతం పలికి కడప జిల్లాలోకి ఆహ్వానించారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి
వేంపల్లె, నవంబరు 5(ఆంధ్రజ్యోతి) : వేంపల్లె పాపాఘ్ని నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా ఇనచార్జి మంత్రి సవితకు వేంపల్లె రైతులు విన్నవించారు. వేంపల్లె ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ నేతలు, మండల కన్వీనర్ మునిరెడ్డి, మైనార్టీ కార్పొరేషన మాజీడైరెక్టర్ షబ్బీర్, రైతు విభాగ రాష్ట్ర నాయకులు జగన్నాథరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నందిపల్లె రామగంగిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి వీరభద్ర, యువనాయకులు నామా వేమ తదితరులు ఘనస్వాగతం పలికారు.
హనుమాన జంక్షనలో...
వేంపల్లెలోని హనుమాన జక్షనలో మంత్రి సవితకు, బీటెక్ రవికి ఘనస్వాగతం పలికారు. జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జయరామిరెడ్డి, వేంపల్లె పట్టణ అధ్యక్షుడు ఆర్వీ రమేష్, మాజీ మండల కన్వీనర్ మల్లంగి భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, జయచంద్రారెడ్డి, ఎద్దు ల శేషారెడ్డి,రెడ్డి కిషోర్ తదితరులు ఘనస్వాగతం పలికారు. వేంపల్లె అభివృద్ధికి సహకరించాలని కోరారు.
రౌడీషీటర్లుగా తొలగించాలని వినతి
చక్రాయపేట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): గత ప్రభు త్వం కక్షపూరితంగా రౌడీషీటర్లుగా తమపై కేసులు న మోదు చేయించిదని, రౌడీషీటర్ల నుంచి తమ పేర్లు తొలగించాలని చక్రాయపేట మండల సీనియర్ నాయకుడు లోమడ భాస్కర్‌రెడ్డి, బీసీ సంఘం నాయకుడు రమేష్ మంత్రి సవితకు విన్నవించారు. మంగళవారం కడపలో ఎమ్మెల్యే మాధవి, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని కలిసి విన్నవించారు.
ఇనచార్జ్ మంత్రిని కలిసిన లక్ష్మీరెడ్డి
కడప ఎడ్యుకేషన, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఇనచార్జ్ మంత్రిని మంగళవారం టీడీపీ సీనియర్ నా యకుడు, అలంఖానపల్లె లక్ష్మీరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. బిల్డప్ సర్కిల్ పుత్తా ఎస్టేట్‌లో మంత్రిని కలిసి గజమాలతో సత్కరించారు. అనంతరం లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
బ్రౌన జయంతిని అధికారికంగా నిర్వహించాలి
బ్రౌన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీ బ్రౌన సలహా మండలి సభ్యుడు జానమద్ది విజయభాస్కర్ కోరారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో జిల్లా ఇనచార్జ్ మంత్రి సవితను కలిసి వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు.
చేనేతల జీవితాల్లో వెలుగులు నింపాలి
కడప మారుతీనగర్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని టీడీపీ తొగటవీర క్షత్రియ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు మడక చక్రధర్ మంత్రి సవితకు విన్నవించారు. అనంతరం చేనేత వెల్ఫేర్ సొసైటీ పోస్టర్లను మంత్రి చేతుల మీ దుగా ఆవిష్కరింపచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సమితి నాయకులు పట్టుపోగుల సుబ్బారావు పాల్గొన్నారు.
వైవీయూను ప్రక్షాళన చేయాలి
కడప ఎడ్యుకేషన, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హాయాంలో వైవీయూలో జరిగిన అక్రమ ని యామకాలు అవినీతిపై సీఐడీతో విచారణ చేయించాలని టీఎనఎ్‌సఎ్‌ఫ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేశ డిమాండ్ చేశారు.
మంగళవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో జిల్లా ఇనచార్జ్ మంత్రి సవితను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన, రోస్టరు నిబంధనలు పాటించకుండా 191 మందికి ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలను అక్రమంగా నిర్వహించారన్నారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు భరతసింహ, అమృత, పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన టీడీపీ నేత గోవర్ధనరెడ్డి
కడప ఎడ్యుకేషన, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కడప నగరం ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌ్‌సలో మంగళవారం ఇనచార్జ్ మంత్రి సవితను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి కలిశారు. ఇనచార్జ్ మంత్రికి పుష్పగుచ్ఛం అందించి దుశ్శాలువాతో సత్కరించారు.
సమస్యలు పరిష్కరించాలి: ఎస్టీఎఫ్
కడప ఎడ్యుకేషన, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రామాంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో మంత్రి సవితకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ 35 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు.