వర్షం వస్తే.. దుస్థితిలో గ్రామీణ రోడ్లు
ABN , Publish Date - Dec 24 , 2024 | 11:48 PM
కొద్దిపాటి వర్షమొచ్చినా గ్రామీణప్రాం త రోడ్లు బురదమయంగా మారి ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. నిమ్మ నపల్లె మండలంలోని గూడుపల్లి రోడ్డు వర్షానికి బురదమయంగా మారింది.
నిమ్మనపల్లి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): కొద్దిపాటి వర్షమొచ్చినా గ్రామీణప్రాం త రోడ్లు బురదమయంగా మారి ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. నిమ్మ నపల్లె మండలంలోని గూడుపల్లి రోడ్డు వర్షానికి బురదమయంగా మారింది. దీంతో జనం రోడ్లపై నడవాలంటేనే హడలిపోతున్నారు. అలాగే కొండయ్యగారిపల్లి పంచాయతిలో వెంకోజిగారిపల్లి మురుగునీటి కాలువలు లేక రోడ్డు పైనే నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. ముష్టూరు పంచాయతీలో అయితే ఇళ్ల మందరే మురుగనీటి కాలువలు ఉన్నా వాటిని శుభ్రం చేయకపోవడంతో వర్షం వస్తే మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ వాహ నదారులకు, పాదాచారులకు ఇబ్బందకరంగా మారింది. రాచవేటివాటివారిపల్లి గ్రామ పంచాయతిలో కొన్ని గ్రామాలకు అయితే మురుగు నీటి కాలువలు, రోడ్లు సైతం వేయలేదు. అలాగే తవళం, వెంగంవారిపల్లి, రెడ్డివారిపల్లి, బండ్లపై గ్రామ పంచాయతిల్లో కూడా పారిశధ్య పనులు చేపట్టకపోవండంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. అయితే మండల అధికారులు మాత్రం సమస్యలపై ఫిర్యాధులు చేసినా పట్టించుకొలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తుడంతో తమ గ్రామాలకు రోడ్లు, కాలువలు నిర్మిస్తారని ప్రజలు ఆశగా ఎదరు చూస్తున్నారు.