బకాయిల చెల్లింపులో జాప్యమెందుకు : యూటీఎఫ్
ABN , Publish Date - Nov 11 , 2024 | 12:14 AM
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల చెల్లింపులో జాప్యం ఎందుకని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన క్యాదర్శులు ఎం. విజయకుమార్, మహేశబాబు పేర్కొన్నారు.
కడప ఎడ్యుకేషన, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల చెల్లింపులో జాప్యం ఎందుకని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన క్యాదర్శులు ఎం. విజయకుమార్, మహేశబాబు పేర్కొన్నారు. ఆదివారం కడప నగరం యూటీఎఫ్ భవనలో జిల్లా ఆఫీసు బేరర్స్ సమావేశంలో వారు మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలన్నింటినీ ఆరు నెలల్లోపు పూర్తిస్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా చెల్లించకపోవడం తగదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకండా వేధింపులకు గురి చేసిందన్నారు. తమ అవసరాల కోసం దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ సొమ్ము కూడా చెల్లించకుండా ప్రభుత్వం తమ అవసరాలకు మళ్లించుకుందని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అయినా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, జిల్లా నాయకులు రవికుమార్, సుజాతరాణి, నరసింహరావు, రమణ, శ్రీనివాసులు, కె,చెన్నయ్య, ఎజాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.