గృహనిర్మాణాలు ముందుకు సాగేనా..?
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:51 PM
పెద్దతిప్పసముద్రం మండలంలోని వివిధ గ్రామా ల్లో గృహ నిర్మాణాలు పూర్తి ఎప్పుడవుతాయోనని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పెద్దతిప్పసముద్రం డిసెంబరు 27 (ఆంద్రజ్యోతి) : పెద్దతిప్పసముద్రం మండలంలోని వివిధ గ్రామా ల్లో గృహ నిర్మాణాలు పూర్తి ఎప్పుడవుతాయోనని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2348 గృహాలు మంజూరు కాగా ఇందులో కేవలం 1262 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. బీబీఎల్ లెవెల్‌లో 403 గృహాలు ఉండగా వాటికి వివిధ కారణాలతో ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. బీఎల్ లెవెల్‌లో మండల వ్యాప్తంగా 304, లింటల్ లెవెల్ లో 17 గృహాలు ఉండగా వివిధ గ్రామాల్లో రూప్ లెవెల్‌లో 224 గృహాలు ఉన్నాయి. కొన్ని గృహాలు అయితే మోల్డింగ్ వేసి ప్లాస్టింగ్ చేయాల్సినవి 61 గృహాలు ఉన్నాయి. ఇక మండలంలోని వివిధ గ్రా మాల్లో 33 గృహాలు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసినా ఇంత వరకు ప్రారంభం చేయక పోవడంతో అదికారులు వాటిని రద్దు చేశారు.
మౌలిక వసతుల్లేక నిలిచిన పనులు
మండలంలోని పెద్దతిప్పసముద్రం, రంగసముద్రం, కందుకూరు, కమ్మచెరువు, పులికల్లు, గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వం సొంత స్థలాలు లేని వారికి గుట్ట లు, వాగులు ఉన్న ప్రాంతాల్లో స్థలాల్లో జగనన్న లేఔట్లు కేటాయించింది. ఆయా కాలనీల్లో మౌలిక వసతులు లేక పోవడం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఎక్కడికి చాలక పోవడంతో ఆయా కాలనీల్లో గృహనిర్మాణాలను లబ్ధిదారులు కట్టుకోలే ని స్థితిలో వదిలేశారు. కాగా ఇంక కొన్ని చోట్ల జగనన్న గృహాలను కొండలు, గుట్టల్లో స్థలాలు కేటాయించడం అక్కడ గుట్టల్లో నీటి సమస్యలు, సరైన దారి లేక పోవడం వంటి సమస్యలతో లబ్ధి దారులు నిర్మాణాలను అర్దాంతరంగా నిలిపేశారు. గుట్టల్లో స్థలాలు కేటాయించడం అక్కడికి నిర్మాణ సామగ్రి చేర్చుకోవాలంటే ఖర్చు తడిసి మోపెడవు తుండడంతో లబ్ధిదారులు పనులను నిలిపేశారు.
గృహాలను అమ్ముకుంటున్న లబ్ధిదారులు
మండలంలోని అనేక చోట్ల లబ్ధిదారులు గృహాలను అమ్ముకుంటున్నారు. ప్రైవేటుగా బయటి వ్యక్తుల తో బేరాలు కుదుర్చుకుని అగ్రిమెంట్ కాగితాలు రాసుకుని అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఓ వైపు పేదలకు స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తే కొంత మంది వాటిని అమ్ముకుంటుండడం గమనార్హం.
ముందుకు రాని లబ్ధిదారులు
గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న గృహాలకు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభు త్వం బిల్లులు మంజూరు చేస్తామని నిర్మాణాలు వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులు చెపుతున్నా లబ్ధిదారులు మందుకు రావడం లేదు. పనులు ప్రారంభిస్తే బిల్లులు మంజూరు చేస్తామని అదికారులు గ్రామాల్లోకి వెళ్లి పదే పదే వివరి స్తున్నా లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు.
ఇళ్లు అమ్ముతున్నట్లు మా దృష్టికి రాలేదు
మండలంలో ఎక్కడా ప్రభుత్వ గృహాలను అమ్మిన ట్లు మా దృష్టికి రాలేదు. మా దృష్టికి అమ్మినా కొన్నట్లు వచ్చినా అటువంటి వారిపై కేసులు నమో దు చేసి పట్టాలను రద్దు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను ప్రభుత్వ స్థలాలు అమ్మడం కొనడం నేరమని కొన్ని షరతులు పెట్టింది. ఆ షరతులను ఎవ్వరూ ఉల్లంఘించరాదు.
-శ్రీనివాసులు, హౌసింగ్ ఏఈ,
పెద్దతిప్పసముద్రం మండలం