టీడీపీ విజయానికి శ్రమించండి : ముక్కా
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:09 PM
పుల్లంపేట మండలంలోతెలుగుదేశం పార్టీ తరపున రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలని రైల్వేకోడూరు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి పిలుపునిచ్చారు.
పుల్లంపేట, ఏప్రిల్18 : పుల్లంపేట మండలంలోతెలుగుదేశం పార్టీ తరపున రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలని రైల్వేకోడూరు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పుల్లంపేటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అత్యధిక మెజారిటీ సాధించవచ్చునన్నారు. ప్రచార కమిటీలు ఏ విధంగా పనిచేయాలన్న విషయాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. గ్రామస్థాయి నాయకులంతా 20 రోజుల పాటు కష్టపడి పనిచేస్తే చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చూడవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన నేలపాటి రామచంద్రయ్య నాయుడు, పుల్లంపేట మండల అధ్యక్షుడు ఆరే సుధాకర్‌నాయుడు, ఉపాధ్యక్షుడు కాపెర్ల చంద్రశేఖర్‌నాయుడు, క్లస్టర్ ఇనచార్జి పోలి జగదీశ్వర్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షులు కేశినేని నారాయణ నాయుడు, లింగుట్ల వెంకటరమణ, దేవరకొండ నరసింహ, సీనియర్ నాయకులు ముమ్మినేని విజయ్‌కుమార్ చౌదరి, వెంకటసుబ్బయ్య యాదవ్, యూనిట్ ఇనచార్జి చుండు ఈశ్వరయ్య నాయుడు, ముద్ద గంగిరెడ్డి, ఆకేపాటి సుధాకర్‌రెడ్డి, కర్ణం రాజానాయుడు, బాసినేని మనోహర్, కాకర్ల ప్రభాకర్, మురళిరెడ్డి, నరసాపురం శివాజీ, చిన్నం శివయ్య, ఎస్సీ నాయకులు గంగాధర్, కొండంపల్లె మల్లి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి
చిట్వేలి: ఎనడీఏ కూటమి అభ్యర్ధులకు ఓటు వేసి ఆశీర్వదించండి అని ముక్కా రూపానందరెడ్డి సతీమని ముక్కా వరలక్ష్మి కోరారు. గురువారం మండల పరిధిలోని కేవీఆర్‌పురంలో ముక్కా శిరీష కూటమి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్లాస్, కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ చెంచయ్య యాదవ్, పద్మావతమ్మ, కోటి, జనసేన నాయకులు మాదాసు నరసింహ, సుధీర్‌రెడ్డి, తేజ, రాజా, పెంచలయ్య, గుండయ్య నాయుడు, నరేష్, సుబ్బరాయుడు, వెంకటేష్, జయమ్మ, వెంకటసుబ్బయ్య, వెంకటయ్య, వెంకటరమణ, శ్రీను, సుబ్రమణ్యం, కృష్ణయ్య, వెంకటయ్య, మణి, మహేష్, నాగేష్, ఈశ్వరయ్య, గంగయ్య, చెన్నయ్య, సుబ్బయ్య, కొత్తూరు ఈశ్వరయ్య, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.