తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Sep 29 , 2024 | 11:23 PM
నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నా మని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సోద రుడు డాక్టర్ లక్ష్మిప్రసాద్‌రెడ్డి తెలిపారు.
గాలివీడు, సెప్టెంబరు 29: నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నా మని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సోద రుడు డాక్టర్ లక్ష్మిప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆది వారం మండలంలోని నూలివీడు పంచాయతీ నక్కలవాండ్లపల్లెలో తాగునీటి బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మూడు నెలలుగా వివిధ గ్రామాల్లో బోర్లు వేస్తూ తాగునీటి సమస్య తీర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు పెద్దు చిన్నపరెడ్డి, నక్కల చంద్రారెడ్డి, పెదు ్దరెడ్డి అప్పరెడ్డి, మాజీ సర్పంచ ఫరీద్‌బాషా, ఈశ్వర్‌రెడ్డి, పురుషోత్తం రెడ్డి, మహబూబ్ బాషా, చంద్రప్ప, శేఖర్‌రెడ్డి, అమర్నాథరెడ్డి, నారాయణరెడ్డి, యోగాంజుల్‌రెడ్డి, లోకేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాయచోటిటౌన: మాధవరం గ్రామంలోని జురుకువాండ్లపల్లె, మద్దెవాండ్లపల్లె, కురవపల్లె, మాధవరం కస్పాల్లో తాగునీటి సమస్య నెలకొని ఉందని గ్రామ నాయకుల ద్వారా సమస్య తెలుసుకున్న మండిపల్లి లక్ష్మిప్రసాద్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యను వెంటనే పరి ష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆది వారం ఆయన మాధవరం గ్రామంలోని జురు కువాండ్లపల్లె, మద్దెవాండ్లపల్లె, కురవపల్లి, మా ధవరం కస్పాల్లో బోరు వేయడానికి రిగ్గును పంపించారు. గ్రామస్తులు, టీడీపీ నాయకు లు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
కంటి ఆసుపత్రిలో అన్నదానం
చెన్నముక్కపల్లిలోని లయన్స కంటి ఆసుపత్రి లో గుర్రంకొండ మండలం మొటుకు గ్రామస్తు లు యర్రగుండ చంద్రారెడ్డి కుమారుడు గోవ ర్థనరెడ్డి (ఎన్నారై) కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్ర మాన్ని డాక్టర్ మండిపల్లి లక్ష్మిప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స క్లబ్ కంటి ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రతి ఆదివారం చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు అన్నదాన ం చేయడం ఒక గొప్ప పుణ్య కార్యక్రమం అన్నారు. అనంతరం దాత చంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు లయన్స కంటి ఆసుపత్రి చైర్మెన వైవీఆర్ స్వరూపగుప్త ఆధ్వర్యంలో డాక్టర్ లక్ష్మిప్రసాద్రెడ్డిని శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన చెన్నూరు అన్వర్‌బాషా, ప్రముఖ వైద్యుడు బయారెడ్డి, రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు గుర్రం సుబ్బయ్య నాయుడు, టీడీపీ నేతలు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, కొండారెడ్డి, జయరాంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, దాత చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, కంటి ఆసుపత్రి సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.