Youth help వరద బాధిత విద్యార్థులకు యువత చేయూత
ABN , Publish Date - Sep 21 , 2024 | 11:04 PM
వరదల కారణంగా ముంపునకు గురైన పాఠశాలల విద్యార్థులకు రాజుకుంట యువత చేయూతనందించారు.
చిట్వేలి, సెప్టెంబరు 21 : వరదల కారణంగా ముంపునకు గురైన పాఠశాలల విద్యార్థులకు రాజుకుంట యువత చేయూతనందించారు. ముంపునకు గురైన విజయవాడ వాంబే కాలనీ లోని జెడ్‌డీఎంఎంసీ ఎలిమెంటరీ పాఠశాలలోని 450 మంది విద్యార్థులకు రూ. 65 వేల విలువైన 3300 పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు శనివారం పంపిణీ చేశారు. అదే ప్రాంగణంలో ఉన్న అంగ న్వాడీ స్కూల్‌కు రూ. 5 వేల విలువైన వ స్తువులను, నిర్మల శిశుభవనలోని దివ్యాంగు లకు 5 వేలు అందజేశారు. దాతలకు స్కూలు యాజ మాన్యం, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపా రు. ఈ కార్యక్రమంలో విజయవాడలో మండల విద్యా శాఖాధికారి వెంకటేశ్వర్ రావు, రాజుకుంట గ్రా మ యువకులు నానబాల సుర్రేంద, పవన, సా యికిరణ్, దిలీప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నలందా విద్యార్థుల సాయం రూ.1.05 లక్షలు
రాజంపేట: వరదబాఽధితులకు రీజెన్సీ నలందా విద్యార్థులు 1.05 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. రీజెన్సీ నలందా విద్యాసంస్థల అధి నేత, రీజెన్సీ సిరామిక్ ఎండీ డాక్టర్ జీఎన నాయుడు ఎదుట ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జీఎన నాయుడు మాట్లాడుతూ చిన్నారులు తమ తల్లిదండ్రులు అందజేసిన ప్యాకెట్‌మనీని ఖర్చుచేయకుండా వరద బాధి తులకు వెచ్చించడం స్ఫూర్తిదాయకమన్నారు. తమ సంస్థల ద్వారా సుమారు 25 లక్షల రూ పాయల వరకు వరద బాధితులకు అందజేయనున్నట్లు తెలిపారు.