Spiritual Celebrations : తిరుమలలో కార్తీక దీపోత్సవం
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:41 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం...
తిరుమల, డిసెంబరు15(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం కన్నులపండువగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు పూర్తయ్యాక సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో పౌర్ణమిగరుడసేవను టీటీడీ రద్దు చేసింది.