Share News

Pawan kalyan: మీరు చేసిన పాపాలు ఏమిటో ఆ స్వామి వారే చెబుతారు

ABN , Publish Date - Oct 03 , 2024 | 07:25 PM

సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలుగ చేసే చర్యలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అమలయ్యేలా బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

Pawan kalyan: మీరు చేసిన పాపాలు ఏమిటో ఆ స్వామి వారే చెబుతారు

తిరుపతి, అక్టోబర్ 03: సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలుగ చేసే చర్యలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అమలయ్యేలా బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.


గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వారాహి డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలను వివరించారు. ఏ మతానికి, ఏ ధర్మానికైనా భంగం వాటిల్లినా ఒకేలా స్పందించేలా లౌకికవాదాన్ని పాటించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏడాది నిధులు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు.


అలాగే ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతను దృవీకరించే విధానాన్ని సైతం అమల్లోకి తీసుకు రావాలని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక ఆలయాలు కేవలం అధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా విద్యా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.


గత జగన్‌ ప్రభుత్వంపై పవన్ విసుర్లు..

గత ప్రభుత్వం చేసిన దాంట్లో లడ్డూ ప్రసాదం కల్తీ చాలా చిన్న విషయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గుమ్మడికాయల దొంగ అంటే.. మీరు భుజాలు తడుముకుంటున్నారంటూ వైసీపీ నేతల వైఖరిని విమర్శించారు. ఈ అంశంపై దర్యాప్తు చేయమంటే.. రాజకీయాలు చేస్తున్నామంటున్నారన్నారు.


సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే తిట్టే రకం మీరు..

జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డుపైనే తమ ఆరోపణలని ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మేం వచ్చాక పంచాయితీల రూపు రేఖలు మారుస్తున్నామని తెలిపారు. చివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే తిట్టే రకం మీరంటూ వైసీపీ నేతలపై పవన్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.


స్వామి వారి నిజరూప దర్శనం జరిగినప్పుడు ...

మీరు చేసిన పాపాలు ఏమిటో ఆ స్వామి వారే చెబుతారన్నారు. స్వామి వారి నిజరూప దర్శనం జరిగినప్పుడు ఆ విషయం మీకే తెలుస్తుందని స్పష్టం చేశారు. పాత ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారు.. ఆయన ఎందుకు మాట్లాడరని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఎందుకు స్పందించరని ఈ వేదిక మీద నుంచి వారిని నిలదీశారు.


జగన్‌పై 28 పెండింగ్ కేసులున్నాయి...

ఆచారాలు పాటించని మీరు.. టీటీడీ బోర్డులో ఎందుకున్నారన్నారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై 28 పెండింగ్ కేసులున్నాయని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాటిలో కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని వివరించారు. ఆలయాలపై దాడి చేసిన వారిపై మీరు ఏ చర్యలు తీసుకున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్‌ను పవన్ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో అనేక అన్యాయాలు చేసిందన్నారు.


రూ. 10 వేలు తీసుకుని.. రూ. 500లకు రసీదు...

తిరుమల ప్రసాదాల్లో నిబంధనల ఉల్లంఘనపైనే మా ఆవేదన అంతా అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అందులోభాగంగానే గత ప్రభుత్వంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. వైవీ సుబ్బారెడ్డి హయాంలో రూ. 10 వేలు తీసుకుని రూ. 500కి రసీదు ఇచ్చేవారని పవన్ పేర్కొన్నారు.

For AndhraPradesh News and Telugu News..

Updated Date - Oct 03 , 2024 | 08:03 PM