Home » Varahi Yatra
సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలుగ చేసే చర్యలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అమలయ్యేలా బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు.. జనసేన ఒక పార్టీనా అంటూ ఎంతోమంది ఐదేళ్ల క్రితం హేళన చేశారు. ఎదుటివారి విమర్శలకు కుంగిపోలేదు. వ్యక్తిగతంగా ఎన్ని ఆరోపణలు చేసినా రాజకీయ రణరంగంలో వెనక్కి పారిపోలేదు. ఓడిపోయానంటూ హేళనచేసినవారికి తగిన గుణపాఠం చెబుతానంటూ సవాల్ విసిరారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగిన మరుసటి రోజే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అలాంటి దాడే జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. గుంటూరు జిల్లాలోని తెనాలిలో వారాహి వాహనంలో యాత్ర కొనసాగిస్తుండగా.. గుర్తు తెలియని ఓ వ్యక్తి పవన్‌పై రాయి విసిరాడు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఆదివారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకి పురోహుతిక అమ్మవారి ఆలయం మూసివేస్తారు. ఈ నేపథ్యంలో దర్శన సమయాన్ని సాయంత్రం 4కి మార్చుకున్నారు. రేపు ఉదయం పిఠాపురం దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు.
పిఠాపురంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ చేశారు. నేటి నుంచి పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చేబ్రోలులో మొదటి ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. వారాహి విజయభేరి యాత్ర పేరిట పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నాలుగో విడత చేపట్టిన వారాహి యాత్ర(Varahi Yatra)పై పోలీసుల కనుసనల్లోనే వైసీపీ రౌడీ మూకలు దాడికి కుట్ర పన్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం (Jagan Govt) తెచ్చిన వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు.. సర్కార్‌లో వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం (నేడు) నుంచి 4వ విడత వారాహి విజయ యాత్ర (Varahi Yatra) చేపడతారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి ప్రారంభమవనుంది. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో 5 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. అవనిగడ్డ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం 3 గంటలకు భారీ బహరంగసభ జరగనుంది.