Kotamreddy Sridhar Reddy: రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించిన కోటంరెడ్డి
ABN , Publish Date - Jul 12 , 2024 | 01:46 PM
ప్రపంచ ప్రఖ్యాత బారాషహీద్ దర్గాలో ఈ నెల 17వ తేది నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. గతంలో రొట్టెల పండుగని రాష్ర్ట పండుగగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. బారాషహీద్ దర్గా, రొట్టెల పండుగ ఏర్పాట్లని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు
నెల్లూరు: ప్రపంచ ప్రఖ్యాత బారాషహీద్ దర్గాలో ఈ నెల 17వ తేది నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. గతంలో రొట్టెల పండుగని రాష్ర్ట పండుగగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. బారాషహీద్ దర్గా, రొట్టెల పండుగ ఏర్పాట్లని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) పరిశీలించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. రొట్టెల పండుగకి దేశ విదేశాల నుంచి కులమతాలకి అతీతంగా లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారని తెలిపారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. బారాషహీద్ దర్గా వ్యక్తిగతంగా తనకూ చాలా విశ్వాసం ఉందన్నారు. దర్గా అభివృద్దికి గతంలో దివంగత ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చేసిన కృషి మాటల్లో చెప్పలేమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
మనసులో ఏదైనా కోరిక కోరుకుని రొట్టెలను పంచితే కోరిక తప్పక నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. కోరిక నెరవేరిన తరువాత కూడా రొట్టెలను పంచుతారు. ఈ రొట్టెలలో కోరికను బట్టి పలు రకాలుంటాయి. తాము మనసులో తలచుకున్న కోరిక పేరు మీదుగానే రొట్టెలను పంచుతారు. పైగా ఆ రొట్టెను కూడా అలాంటి కోరిక ఉన్నవారు మాత్రమే అందుకుంటారు. అంటే.. ఆరోగ్యం గురించి మొక్కుకుని రొట్టెలను పంచుతుంటే.. ఆరోగ్య రొట్టె కావల్సిన వారు దానిని అందుకుంటారు. ఇంట్లోనే ఈ రొట్టెలను తయారు చేసుకుని వస్తారు. దర్గాకు వచ్చిన తర్వాత అక్కడి చెరువులోకి దిగి తలపై ముసుగు వేసుకుని రొట్టెల మార్పిడి చేసుకుంటారు.
ఇవి కూడా చదవండి..
Gudivada Amarnath: ‘తల్లికి వందనం’ పథకంపై అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Arvind Kejriwal: సుప్రీంలో కేజ్రీవాల్‌కు బెయిల్
Read Latest AP News AND Telugu News