కొట్లాట కేసులో 17 మందికి రిమాండ్
ABN , Publish Date - Oct 06 , 2024 | 01:40 AM
బలరా మునిపేటలో గురువారం తెల్లవారుజామున శక్తిపటాల ఊరేగింపు సందర్భంగా జరిగిన కొట్లాట కేసులో 17 మందిని అరెస్టు చేసి శని వారం రిమాండ్‌కు పంపారు.
మచిలీపట్నం టౌన్, అక్టోబరు 5: బలరా మునిపేటలో గురువారం తెల్లవారుజామున శక్తిపటాల ఊరేగింపు సందర్భంగా జరిగిన కొట్లాట కేసులో 17 మందిని అరెస్టు చేసి శని వారం రిమాండ్‌కు పంపారు. డీఎస్పీ సుభాని, ఆర్‌పేట సీఐ ఏసుబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. శక్తిపటాల ఊరే గింపు జరుగుతున్నప్పుడు పాత తగాదాల నేపథ్యంలో బడుగు త్రినాథ్, జొన్నలగడ్డ వరప్రసాద్, దొంతు పృధ్వీరాజ్‌లపై 17 మంది దాడి చేశారు. వారిలో బడుగు త్రినాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సంగతి విదితమే. దాడిలో పాల్గొన్న వెన్నా మోహన్, మణికంఠ, కొల్లా శివ, కొల్లా సాయి, వెన్నా జగన్, పీర్ రాక్స్‌తో పాటు మరో 11 మందిని ఆర్‌పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. హత్యాయత్నం కేసు కింద నమోదు చేసి 17 మందిని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్‌కు పంపారు. వారిలో గుడ్లవల్లేరు కళాశాల విద్యా ర్థులు 13 మంది ఉండటంతో పోలీసుస్టేషన్ వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శక్తి పటాల ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని, మద్యం తాగి కొందరు ఊరేగింపులో పాల్గొం టున్నట్టు ఫిర్యా దులు అందుతున్నా యని, కఠిన చర్యలు తప్ప వని డీఎస్పీ, సీఐ హెచ్చరించారు.