270 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:58 AM
సూరంపల్లి శివారులో అనధికారికంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గన్నవరం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): సూరంపల్లి శివారులో అనధికారికంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం నిల్వచేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావటంతో సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది గోడౌన్ వద్దకు వెళ్లారు. 550 బస్తాల్లో రవాణా చేసేందుకు సిద్ధం చేసిన 270 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విజయవాడకు చెందిన రమేష్ రేషన్ బియ్యాన్ని నిల్వ చేశాడని పోలీసులు తెలిపారు.