నగరంలో చెత్త తొలగింపునకు కంప్యాక్టర్ వాహనం
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:05 AM
స్వచ్ఛతను మరింత మెరుగుపర్చేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన కంప్యాక్టర్ వాహనాలు ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.
పనితీరు బాగుంటే అన్ని మునిసిపాలిటీల్లోనూ వినియోగం: మంత్రి పొంగూరు నారాయణ
చిట్టినగర్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛతను మరింత మెరుగుపర్చేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన కంప్యాక్టర్ వాహనాలు ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శుక్రవారం లెనిన్ సెంటర్ సీఆర్డీయే కార్యాలయం వద్ద నగరంలో చెత్త తొలగింపునకు నూతన కంప్యాక్టర్ వాహనాన్ని కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ వాహనం వినియోగించి నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో 14 టన్నుల చెత్తను తరలించే ఈ వాహనాన్ని ప్రయోగాత్మకంగా వినియోగించి, వాహనం పనితీరుపై పూర్తి సమాచారం తెలుసుకున్నాక పనితీరు బాగుంటే రాష్ట్రంలోనే అన్ని మున్సిపాలిటీల్లో చెత్త తరలింపునకు వాహనాలు వినియోగిద్దామని అధికారులకు మంత్రి సూచించారు. చీఫ్ ఇంజనీర్ ఆర్.శ్రీనాథ్, ఇన్‌చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురే్‌షబాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్‌చార్జి వెహికల్ డిపో ఏసుపాదం పాల్గొన్నారు.