బందరులో ఇంటింటికీ కుళాయి
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:42 AM
నగరంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఇస్తున్నామని, యజమానులు ఈనెల 30వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మునిసిపల్ కమిషనర్ బాపిరాజు సూచించారు.
30లోపు దరఖాస్తు చేసుకోండి: కమిషనర్ బాపిరాజు
మచిలీపట్నం టౌన్, సెప్టెంబరు 11: నగరంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఇస్తున్నామని, యజమానులు ఈనెల 30వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మునిసిపల్ కమిషనర్ బాపిరాజు సూచించారు. కుళాయి కనెక్షన్‌కు ఉచితంగా పైపులు వేస్తామని ఆయన తెలిపారు. అన్ని సచివాలయాల్లో కనెక్షన్‌కు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆధార్ కార్డు, ఇంటి పన్ను రశీదు, ఆస్తి ధ్రువీకరణ జిరాక్స్ కాపీలు, ఇంటి పన్ను బకాయిలను పూర్తిగా చెల్లించి ఆ రశీదు జిరాక్స్ కాపీని పూర్తి చేసిన దరఖాస్తులకు జతచేసి ఇంజనీరింగ్ విభాగంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు అందించాలని ఆయన సూచించారు.