Share News

దుర్గమ్మకు కానుకగా బంగారు నత్తువ

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:42 AM

ఇంద్రకీలాద్రిపై శుక్రవారం భక్తుల రద్దీ ఏర్పడింది. అమ్మవారి దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు.

దుర్గమ్మకు కానుకగా బంగారు నత్తువ
11 గ్రాముల బంగారు నత్తువను అందజేస్తున్న బొడ్డు శ్రీధర్‌ దంపతులు

వన్‌టౌన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై శుక్రవారం భక్తుల రద్దీ ఏర్పడింది. అమ్మవారి దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్‌ కొత్తపేట టీవీటీ మార్కెట్‌ ప్రాం తంలోని శ్రీధర్‌ శారీ హౌస్‌ యజమాని బొడ్డు శ్రీధర్‌ శుక్రవారం తన కుటుంబ సభ్యులతో ఇంద్రకీలాద్రికి విచ్చేసి అమ్మవారి అలంకరణ నిమిత్తం ఎరుపు, తెలుపు, పచ్చరాళ్లు పొదిగిన 11 గ్రాముల నాసికాభరణం(నత్తువ)ను ఆలయ అధికారులకు అందజేశారు.

అన్నవితరణకు రూ.లక్ష విరాళం

నగరంలోని వన్‌టౌన్‌ సమ్మెట వారి వీధికి చెందిన పల్లపోతు వెంకట శ్రీనివాసరావు ఆలయంలో అన్నవితరణ నిమిత్తం రూ.లక్ష చెక్కును డిప్యూటీ ఈవో రత్నరాజుకు అందజేశారు.

Updated Date - Nov 30 , 2024 | 12:42 AM