Share News

విమానాశ్రయ విస్తరణ పనులపై కలెక్టర్‌ ఆరా..

ABN , Publish Date - Jun 21 , 2024 | 01:24 AM

గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులపై వివిధ శాఖల అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ సమీక్షించారు. తొలుత ఎయిర్‌పోర్టు విస్తరణ వివరాలు తెలుసుకున్నారు. శాఖల వారీగా పనులపై ఆరా తీశారు. దావాజీగూడెం, అజ్జంపూడి గ్రామాల్లో పర్యటించారు.

విమానాశ్రయ విస్తరణ  పనులపై కలెక్టర్‌ ఆరా..
మాట్లాడుతున్న కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ

గన్నవరం, జూన్‌ 20 : గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులపై వివిధ శాఖల అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ సమీక్షించారు. తొలుత ఎయిర్‌పోర్టు విస్తరణ వివరాలు తెలుసుకున్నారు. శాఖల వారీగా పనులపై ఆరా తీశారు. దావాజీగూడెం, అజ్జంపూడి గ్రామాల్లో పర్యటించారు. గన్నవరం-ఉంగుటూరు మధ్య ఏలూరు కాలువపై నిర్మించనున్న వంతెన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌, వెంచర్‌లను పరిశీలించారు. మొత్తం 896 ఎకరాలు సేకరించామని, అందులో 90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని కలెక్టర్‌కు అధికారులు వివరించారు. భూములు కోల్పోయిన వారికి కౌలు చెల్లించాల్సి ఉందని, డ్రెయినేజీ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అద్దె చెల్లించాలని చెప్పారు. నష్ట పరిహారం పెంచాలని కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు పూర్తిస్థాయిలో పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎమ్మెల్‌కె రెడ్డి, ఆర్డీవో పద్మావతి, తహసీల్ధారు పవన్‌కుమార్‌, మండల సర్వేయర్‌ మాధవరావు, ఆర్‌ఐ ఉదయ్‌కుమార్‌ వీఆర్వో శ్రీరామ్‌ కుమార్‌ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2024 | 01:24 AM