Share News

కొండ ప్రాంతాల్లో ఇళ్లన్నింటికీ పట్టాలిస్తాం: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:54 AM

కొండప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు.

కొండ ప్రాంతాల్లో ఇళ్లన్నింటికీ పట్టాలిస్తాం: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌
ఇళ్ల పట్టాల సమస్యపై వినతిపత్రం స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, తహసీల్దార్‌ రోహిణీ దేవి

మొగల్రాజపురం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కొండప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు. సోమవారం సున్నపుబట్టీల సెంటర్‌ అమ్మ కల్యాణ మండపంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. 2019లో టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్‌ సర్వే చేయించి పట్టాలు సిద్ధం చేసిందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వమొచ్చాక కొండ ప్రాంతవాసులు ఇళ్ల పట్టాల సమస్యలను చెబుతున్నారని, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ నాయకుల భూ కబ్జాల వ్యవహారాలను సదస్సు దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. సదస్సుల్లో వీఆర్వోలు, ఆర్‌ఐలు, తహసీల్దార్లు, సర్వేయర్లు ఉంటారని సమస్యలను అక్కడిక్కడే పరిష్కారం చేస్తారని చెప్పారు. తహసీల్దార్‌ రోహిణీదేవి, సర్వేయర్‌ లక్ష్మీదుర్గ, కార్పొరేటర్‌ చెన్నుపాటి ఉషారాణి, నందిపాటి దేవానంద్‌, పెనుగొండ శ్రీను. రేపాకుల శ్రీను, యాసర్ల వంశీకృష్ణ, పరస సుమన్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:54 AM