అభివృద్ధి.. సంక్షేమానికే కూటమి ప్రాధాన్యం
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:43 AM
అభివృద్ధి, ప్రజాసంక్షేమానికే కూటమి ప్రభుత్వం ప్రధాన్యతనిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్య నారాయణ(సుజనా చౌదరి) అన్నారు.
చిట్టినగర్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, ప్రజాసంక్షేమానికే కూటమి ప్రభుత్వం ప్రధాన్యతనిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్య నారాయణ(సుజనా చౌదరి) అన్నారు. పశ్చిమ నియో జకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన స్థానిక కార్పొరేటర్లతో కలసి శంకుస్థాపన చేశారు. 48వ డివిజన్ ఆళ్ల నాగయ్య వీధిలో 31లక్షల 95వేల రూపాయలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, 49వ డివిజన్ వీరయ్య వీధి కొండప్రాంతంలో 37 లక్షల 57వేల రూపాయలతో రిటైనింగ్ వాల్ పనులు, నన్నే సాహెబ్ వీధిలో 19లక్షల 95వేల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకొని, అందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తు న్నామన్నారు. పురపాలశాఖ మంత్రి నారాయణ సహకారంఅందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్లు బుల్లా విజయ్‌కుమార్, అత్తులూరి ఆదిలక్ష్మి పెద బాబు, మరుపిళ్ళ రాజేష్, మహాదేవు అప్పాజీరావు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, (చంటి)మైలవరపు దుర్గారావు, అర్షద్, బడుగు వెంకన్న, పల్లె పోగు ప్రసాద్, జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.
సుజనా చౌదరిని కలిసిన బుద్దా వెంకన్న
వన్‌టౌన్ : టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న శనివారం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. కానూరులోని ఆయన ఇంటికెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరిం చారు. నాయ కులు కోదండ రామారావు, మైలవరపు వీరబాబు, సురభి బాలపాల్గొన్నారు.