లయోల క్రీడా ప్రాంగణంలో వాకింగ్‌కు అనుమతివ్వండి
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:04 AM
ఆంధ్రా లయోలా కళాశాల క్రీడా ప్రాంగణంలో నడిచేందుకు యాజమాన్యం అనుమతించాలంటూ ఆదివారం వాకర్స్ అందరూ ఒక్కసారిగా కళాశాల మెయిన్‌గేటు వద్దకు చేరుకున్నారు.
కళాశాల గేటు ఎదుట వాకర్స్ ఆందోళన..గంట తర్వాత తాత్కాలిక అనుమతులు
భారతీనగర్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా లయోలా కళాశాల క్రీడా ప్రాంగణంలో నడిచేందుకు యాజమాన్యం అనుమతించాలంటూ ఆదివారం వాకర్స్ అందరూ ఒక్కసారిగా కళాశాల మెయిన్‌గేటు వద్దకు చేరుకున్నారు. కళాశాల గేటు వద్ద సిబ్బంది అనుమతించకపోవడంతో యాజమాన్యం తీరుపై అందోళనకు దిగి నిరసన చేశారు. సుమారు గంట తర్వాత తాత్కాలిక అనుమతులు రావడంతో ప్రాంగణంలోనికి వెళ్లి వాకింగ్ చేశారు.
ఇదీ నేపథ్యం..
ఆంధ్రా లయోలా కళాశాల క్రీడా ప్రాంగణంలో లయోలా వాకర్స్ క్లబ్ పేరుతో పాతికేళ్లుగా వేలాది మంది వాకింగ్ చేస్తున్నారు. ప్రతి ఉగాదికి పోటీలు నిర్వహించేవారు. అమరావతి రన్నర్స్ పేరుతో సంఘాన్ని స్థాపించి జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పత కాలు సాధించారు. 2019లో కరోనా సమయం నుంచి యాజమాన్యం గ్రౌండ్‌లో వాకింగ్‌కు అనుమ తించడం లేదు. అప్పటి నుంచి యాజమాన్యాన్ని అనుమతించమని వాకర్స్ అడుగుతున్నారు. రోమ్ నుంచి అనుమతులు రావాలంటూ యాజమాన్యం మాటలు దాటేస్తూ వస్తోంది. దీంతో వాకింగ్ కోసం వాక ర్స్ సమీపంలోని రోడ్లు, కాలనీలోని వీఎంసీ పార్కుల్లోకి వెళ్తున్నారు. వాకింగ్‌కు అనుమతించాలని కళాశాల యాజమాన్యాన్ని పలుమార్లు కోరామని, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని వాకర్స్ చెబుతున్నారు.