Share News

ఇసుక కోసం వైసీపీ నేతల అరాచకం

ABN , Publish Date - Jul 30 , 2024 | 01:28 AM

కంచికచర్ల మండలం కీసర ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్ద ఇసుక లోడింగ్‌ విషయంలో స్థానిక వైసీపీ జడ్పీటీసీ భర్త వేల్పుల రమేష్‌, ఆయన సోదరుడితో కలిసి లారీ డ్రైవర్‌పై కర్రలతో దాడికి పాల్పడ్డారు.

ఇసుక కోసం వైసీపీ నేతల అరాచకం

కీసర స్టాక్‌ పాయింట్‌ వద్ద లారీ డ్రైవర్‌పై కార్రలతో దాడి

పోలీసుల సమక్షంలోనే దారుణం... అయినా కేసు లేదు

కంచికచర్ల రూరల్‌, జూలై 29 : కంచికచర్ల మండలం కీసర ఇసుక స్టాక్‌ పాయింట్‌ వద్ద ఇసుక లోడింగ్‌ విషయంలో స్థానిక వైసీపీ జడ్పీటీసీ భర్త వేల్పుల రమేష్‌, ఆయన సోదరుడితో కలిసి లారీ డ్రైవర్‌పై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. ఇసుక లోడింగ్‌ కోసం ఆదివారం రాత్రి వచ్చిన లారీలకు సీరియల్‌గా లోడింగ్‌ కోసం అధికారులు టోకెన్లు జారీ చేశారు. సోమవారం లోడింగ్‌ జరుగుతుండగా కీసరకు చెందిన వేల్పుల వెంకట్రావ్‌తోపాటు పలువురు ట్రాక్టర్‌ డ్రైవర్లు ముందుగా తమ ట్రాక్టర్లకు లోడ్‌ చేయాలని లారీలకు అడ్డు పెట్టారు. దీంతో డ్రైవర్ల మధ్య వివాదం పెరిగింది. మాటామాట పెరిగి జడ్పీటీసీ భర్త వేల్పుల రమేష్‌ అతని సోదరుడు వేల్పుల వెంకట్రావ్‌ మరికొంత మందితో కలిసి లారీ డ్రైవర్‌ను చితకబాదారు. ఎస్సై హైమావతి, డిప్యూటీ తహసీల్దార్‌ నాగుల్‌ మీరా సమక్షంలో లారీ డ్రైవర్‌పై కర్రలతో దాడి చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ విషయంపై కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేయకపోవడం శోచనీయం.

Updated Date - Jul 30 , 2024 | 01:28 AM