‘రేవ్’లో మరో నగరవాసి
ABN , Publish Date - May 25 , 2024 | 12:46 AM
బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీతో విజయవాడకు ఉన్న లింక్‌లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఏ3గా ఉన్న డి.నాగబాబు (32) నగరానికి చెందిన యువకుడిగా గుర్తించారు. అతనితో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు.
ఏ3గా చేర్చిన బెంగళూరు పోలీసులు
విజయవాడ, మే 24 (ఆంధ్రజ్యోతి) : బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీతో విజయవాడకు ఉన్న లింక్‌లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఏ3గా ఉన్న డి.నాగబాబు (32) నగరానికి చెందిన యువకుడిగా గుర్తించారు. అతనితో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు. వారిని ఏ4, ఏ5గా చేర్చారు. ఈ ముగ్గురి కారుల్లో కొకైన్, లిక్విడ్ గంజాయి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. నాగబాబు విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేశాక బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలు పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కడి శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీకి డ్రగ్స్‌ను సరఫరా చేసే బాధ్యతను తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి అతడికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్టు తెలుస్తోంది. పార్టీ నిర్వహించింది బెంగళూరులో అయినా లింక్‌లు మాత్రం విజయవాడను కుదిపేస్తున్నాయి.