Share News

CM Chandrababu: ఫెంగల్ తుఫాన్.. సీఎం చంద్రబాబు ఆదేశాలివే

ABN , Publish Date - Nov 30 , 2024 | 01:05 PM

Andhrapradesh: ఫెంగల్ తుఫానుపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచనలు జారీ చేశారు.

CM Chandrababu:  ఫెంగల్ తుఫాన్.. సీఎం చంద్రబాబు ఆదేశాలివే
AP CM Chandrababu Naidu

అమరావతి, నవంబర్ 30: వేగంగా దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విపత్త నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

డబ్బులు వచ్చేశాయోచ్...


అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచనలు జారీ చేశారు. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. తుఫాన్‌పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.


వాటిని తక్షణమే పునరుద్ధరించండి: మంత్రి గొట్టిపాటి

మరోవైపు.. ఏపీలో తుపాన్ ప్రభావంతో వర్ష సూచన నేపథ్యంలో అధికారులను విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అప్రమత్తం చేశారు. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లోని పరిస్థితులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షం, ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు ఒరిగే ప్రమాదం ఉంటుందని.. ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడాలని తెలిపారు. సమస్యపై ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరాకు అవాంతరాలు ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచనలు చేశారు.

రైల్వే స్టేషన్‌లో ప్రమాదం.. భారీగా వాహనాలు దగ్దం


తిరుపతిలో భారీ వర్షాలు

అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెంగల్ తుఫాన్‌గా మారిన నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలకు, అంగన్వాడి కేంద్రాలకు, జూనియర్ కళాశాలలకు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ నేటి మధ్యాహ్నం సెలవు ప్రకటించారు.


నీట మునిగిన చెన్నై..

అంతేకాకుండా.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడులో వర్షాలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరంలో నీటి ముంపు తీవ్రమైంది. చెన్నై నగరం మొత్తం భారీ వర్షాల కారణంగా రహదారులు మరియు మౌలిక సదుపాయాలు పూర్తిగా నీటమునిగాయి. చెన్నై నగరంలోని పలు ప్రధాన రహదారులు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం కార్యకలాపాలు నిలిచిపోయాయి. కనీసం 22 విమానాలు రద్దు అయ్యాయి. నీటి ముంపు వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

చెన్నైలో వర్షపాతం వివరాలు:

2024 అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు 622.95 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.

నవంబర్ 30న శనివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు గానూ సగటు వర్షపాతం 12.62 మిల్లీమీటర్లుగా నమోదైంది.


ఇవి కూడా చదవండి...

అర్ధరాత్రి గందరగోళం.. వార్డెన్‌ సస్పెండ్

షాకింగ్.. మళ్లీ పంజుకున్న బంగారం, వెండి ధరలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 30 , 2024 | 05:39 PM