Share News

Raghurama Case: డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్‌.. ఇంప్లీడ్ పిటిషన్ వేసిన రఘురామ

ABN , Publish Date - Dec 03 , 2024 | 11:58 AM

Andhrapradesh: రఘురామ తరపున హైకోర్ట్ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ పిటిషన్ వేశారు. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగంలో ప్రభావతి కూడా హత్యాయత్నంలో భాగస్వాములు అయ్యారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామ కృష్ణం రాజును పరీక్షించిన వైద్య బృందం ఆయన కాలుపై బలమైన దెబ్బలు ఉన్నాయని నివేదిక ఇచ్చారని న్యాయవాది తెలిపారు. ఆయన రెండు కాళ్ళకు బలమైన దెబ్బలతో పాటు వాచి ఉన్నాయని పిటిషనర్ వెల్లడించారు.

Raghurama Case: డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్‌.. ఇంప్లీడ్ పిటిషన్ వేసిన రఘురామ
AP Deputy speaker Raghuramakrishnam Raju Case

అమరావతి, డిసెంబర్ 3: ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై (AP Deputy Speaker Raghuram Krishnamraju) థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో అప్పటి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వేసిన ముందస్తు బెయిల్‌పై ఈరోజు (మంగళవారం) జిల్లా కోర్ట్‌లో విచారణకు వచ్చింది. ఈ కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని రఘురామ కృష్ణ రాజు పిటిషన్ వేశారు. రఘురామ తరపున హైకోర్ట్ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ పిటిషన్ వేశారు. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగంలో ప్రభావతి కూడా హత్యాయత్నంలో భాగస్వాములు అయ్యారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామ కృష్ణం రాజును పరీక్షించిన వైద్య బృందం ఆయన కాలుపై బలమైన దెబ్బలు ఉన్నాయని నివేదిక ఇచ్చారని న్యాయవాది తెలిపారు. ఆయన రెండు కాళ్ళకు బలమైన దెబ్బలతో పాటు వాచి ఉన్నాయని పిటిషనర్ వెల్లడించారు.

మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్


వైద్య బృందం ఇచ్చిన నివేదికను టాంపరింగ్ చేశారని, అందుకు భిన్నంగా నివేదిక ఇవ్వడం లో ప్రభావతి కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. బైపాస్ సర్జరీ చేయించకున్న అని చెప్పినప్పటికీ గుండెలపై కూర్చొని బాధారని చెప్పినప్పటికీ ప్రభావతి ఈ అంశాన్ని తొక్కి పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువలనే ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పేర్కొంటూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించాలని న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ కోరారు.


రఘురామ ఇచ్చిన ఫిర్యాదుతో..

కాగా.. 2021 మే నెలలో సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసి, హత్యాయత్నం చేశారని ఈ ఏడాది జూలైలో రఘురామ రాజు ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు నగరంపాలెం స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఆంజనేయులు, సీఐడీ ఏఎస్పీ విజయ్‌పాల్‌, అప్పటి సీఎం జగన్‌, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌ ప్రభావతి, మరి కొంతమందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీని విచారణాధికారిగా నియమించింది. ఈ క్రమంలో రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను ఇటీవల ఒంగోలోని ఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపారు. పోలీసులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు.


ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విచారణ జరిపిన పోలీసులు.. ఈ కేసుకు సంబందించి అనేక ప్రశ్నలు ఆయన ముందు ఉంచారు. అయితే దేనికి కూడా విజయ్ పాల్ సరైన సమాధానం ఇవ్వ లేదు. విచారణ అనంతరం ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో విజయ్ పాల్‌ను కోర్టు నుంచి గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు విజయ్‌పాల్ అనేక ప్రయత్నాలు చేశారు. హైకోర్టులో ఆయనకు చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ కోసం విజయ్‌పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్

రామంతాపూర్‌లో నకిలీ వైద్యుల గుట్టు రట్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 02:29 PM